యువతి ఆత్మహత్య... తనకు సెల్‌ఫోన్ కొనలేదని...

జస్ట్ సెల్‌ఫోన్ కొననందుకు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా... అయ్యో దేవుడా అని తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఆ కుటుంబం.

news18-telugu
Updated: August 5, 2020, 10:14 AM IST
యువతి ఆత్మహత్య... తనకు సెల్‌ఫోన్ కొనలేదని...
యువతి ఆత్మహత్య... తనకు సెల్‌ఫోన్ కొనలేదని... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ... వరంగల్ జిల్లా... దామెరలో జరిగిందో విషాదం. 24 ఏళ్ల మానస డిగ్రీ చదివింది. ఇంటి దగ్గరే ఉంటోంది. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కరోనా వల్ల వీలు కావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆమె దగ్గరున్న సెల్‌ఫోన్ పాడైంది. దాన్ని రిపేర్‌కి ఇచ్చింది. కానీ... రిపేర్ షాప్ వ్యక్తి... ఇది చాలా పాతదండి... దీన్ని రిపేర చేసినా వేస్ట్. ఆ డబ్బుతో కొత్తది కొనుక్కోవడం మేలు అని చెప్పారు. దాంతో మానస తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. తనకు కొత్త మొబైల్ కొని ఇవ్వమని అడిగింది. చూద్దాం లేమ్మా అన్నాడాయన. "ఏంటి చూసేది... నాకు కొత్తది కావాలి. సెల్‌ఫోన్ లేకపోతే ఎలా నాకు కావాలి" అని పట్టుపట్టింది. సరే సరే కొంటాను. కంగారు పడకు అని మాట ఇచ్చాడు. కానీ... కరోనా రోజులు కదా... వెంటనే కొనలేదు. రెండ్రోజులైనా ఆయన మొబైల్ కొనలేదు.

తండ్రిని గమనించిన మానస... ఆయన మొబైల్ కొనరని అనుకుంది. కొనే ఉద్దేశం ఆయనకు లేదని అనుకుంది. మరో రోజు ఎదురుచూసింది. మూడ్రోజులైనా మొబైల్ కొనకపోవడంతో... ఇక కొనరని బలంగా ఫిక్సైంది. ఆ తర్వాత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసింది. అటకపై అందకుండా ఉన్న పురుగుల మందును... చైర్ వేసుకొని మరీ అందుకొని... తాగేసింది. ఆ తర్వాత కాసేపటికి... అమ్మో నొప్పి... బాబోయ్ అని అరుస్తుంటే... చుట్టుపక్కల వాళ్లు ఏంటా అని చూశారు. విషయం తెలుసుకున్నారు.

అయ్యో... మొబైల్ కొనలేదని ఎవరైనా ఇలా చేసుకుంటారా... ఏంటమ్మా ఇదీ... అయ్యో అంటూ... ఆమెను హడావుడిగా వరంగల్ MGM ఆస్పత్రికి తరలిస్తుంటే... మధ్యలోనే ఆమె చనిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు వచ్చి కేసు రాసి... పోస్ట్ మార్టం జరిపించారు. సెల్‌ఫోన్ కొనివ్వలేదని... మనస్తాపం చెంది ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: August 5, 2020, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading