ఫ్రెండ్ ఫోన్ చేయడం లేదని.. ఉరేసుకొని యువతి ఆత్మహత్య

గత 3 రోజులుగా సహచర విద్యార్థి ఫోన్లో చేయడం లేదు. రంజిత కాల్ చేసినా.. పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

news18-telugu
Updated: April 28, 2020, 9:16 PM IST
ఫ్రెండ్ ఫోన్ చేయడం లేదని.. ఉరేసుకొని యువతి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫ్రెండ్ కాల్ చేయడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తనను దూరం పెడుతున్నారనే మనస్థాపంతో ఉరివేసుకొని చనిపోయిది. చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో మంగళవారం ఈ ఘటన చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..  ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న అంజనా దేవి ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. ఈమె కుమార్తె రంజిత(18) విజయవాడలో నీట్ పరీక్ష‌కు కోచింగ్ తీసుకుంటోంది. కరోణ వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ కారణంగా కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చి..తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సహచర విద్యార్థితో ఫోన్లో తరచూ మాట్లాడేది రంజిత. ఐతే గత 3 రోజులుగా సహచర విద్యార్థి ఫోన్లో చేయడం లేదు. రంజిత కాల్ చేసినా.. పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. తల్లి అంజనాదేవి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లగా రంజిత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. షాక్ తిన్న అంజనాదేవి.. బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వచ్చి చూశారు. అప్ప్పటికే రంజిత చనిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. రంజిత ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
First published: April 28, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading