Young Girl: ఎంతపని చేశావ్ అనూష... ఆ సంబంధం కాకపోతే దాని బాబు లాంటి సంబంధం వచ్చేదేమో..!

అనూష మృతదేహం

శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన లక్ష్మణ్, క్రిష్ణవేణి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె(22) ఉన్నారు. ఇటీవల.. లక్ష్మణ్ కూతురు అనూషకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అనూష డిప్లొమా పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. మంచి సంబంధం రావడంతో అనూష కూడా పెళ్లికి ఓకే చెప్పింది.

 • Share this:
  మేడ్చల్: యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతున్నాయి. చిన్నచిన్న సమస్యలకే మానసిక ఒత్తిళ్లకు లోనయి.. ఆత్మహత్య దిశగా అడుగులేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఈతరం యువతీయువకుల్లో ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. ఫలితంగా కన్న తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన మిగులుతోంది. ఈ తరహా ఘటనే మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలో వెలుగుచూసింది. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన లక్ష్మణ్, క్రిష్ణవేణి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె(22) ఉన్నారు. ఇటీవల.. లక్ష్మణ్ కూతురు అనూషకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అనూష డిప్లొమా పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. మంచి సంబంధం రావడంతో అనూష కూడా పెళ్లికి ఓకే చెప్పింది. మూడు చింతలపల్లికి చెందిన ఓ యువకుడితో అనూషకు పెళ్లి నిశ్చయమైంది. అంతా బాగుందనుకున్న తరుణంలో.. కొన్ని కారణాల వల్ల అనూష పెళ్లి రద్దయింది. వరుడి తరపు వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో.. అనూష కుటుంబం సహజంగానే కొంత చింతించింది. కూతురికి మంచి సంబంధం వచ్చిందని సంతోషించిన ఆ తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. అప్పటి నుంచి అనూష కూడా పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. తనకే ఎందుకిలా జరిగిందంటూ స్నేహితురాళ్లకు చెప్పుకుని బాధపడింది. సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఏదో ఆలోచిస్తూ ముభావంగా ఉన్న కూతురిని చూసి తల్లిదండ్రులు కూడా కుమిలిపోయారు. అయితే.. కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం ఆ తల్లిదండ్రులు అస్సలు ఊహించలేదు. అనూష కుటుంబం కొన్ని నెలల నుంచే కొత్తగా ఇంటిని నిర్మించుకునే పనిలో ఉంది.

  గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో లక్ష్మణ్, క్రిష్ణవేణి ఇద్దరూ తమ కొడుకుతో కలిసి కొత్తగా కట్టుకుంటున్న ఇంటి దగ్గరకు వెళ్లారు. అక్కడ పనులను చూసుకుని మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఇంటికెళ్లారు. ఇంటికెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నించారు. అనూష లోపల గడియ పెట్టుకుని టీవీ చూస్తుందని అనుకున్నారు. అయితే.. ‘అనూష.. అనూష’ అని ఎంత పిలిచినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో భయాందోళనకు లోనైన లక్ష్మణ్, అతని కొడుకు తలుపు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు అనూష వేలాడుతూ కనిపించింది. ఊహించని ఈ ఘటనతో అనూష కుటుంబం దిగ్ర్భాంతికి లోనైంది.

  ఇది కూడా చదవండి: north east girl viral video: నిర్భయ తరహా ఘటనతో ఉలిక్కిపడిన బెంగళూరు.. వీడియో వైరల్‌గా మారడంతో...

  ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే ఉరేసుకుని చాలాసేపు కావడంతో అనూష చనిపోయింది. ‘ఎంత పనిచేశావ్ తల్లీ’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనూష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనూష కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: