వారిద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఇంతలోనే యువకుడికి మరో యువతితో పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసి యువకుడిని ప్రేమించిన యువతికి తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ఓదెలలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పొత్కపల్లి ఎస్సై శీలం లక్ష్మణ్, ట్రెయినీ ఎస్సై వంశీకృష్ణరెడ్డి తెలిపిన వివరాలు.. ఓదెల గ్రామానికి చెందిన అల్లం రమేశ్–సంధ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ప్రసన్న(21) హన్మకొండలోని (Hanamkonda) ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. ప్రసన్న ఇదే గ్రామానికి చెందిన రాంనేని సందీప్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు (Love Each Other). సందీప్.. ప్రసన్నకు మేనబావ అవుతాడు. సందీప్.. ప్రసన్నను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
అయితే ఇటీవల సందీప్ వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ (Engagement) చేసుకున్నాడు. ఈ విషయం ప్రసన్నకు తెలియడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Suicide) యత్నించింది.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని (Karimnagar) ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ప్రసన్న మృతిచెందింది.
Honeymoon: పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్‌కు వెళ్లారు.. అక్కడ అలా జరగడంతో మైండ్ బ్లాక్.. చివరకు..
ప్రసన్న మృతితో ఓదెలలో(Odela) విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువుల కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కూతురు ఆత్మహత్యకు సందీప్ అతని తల్లిదండ్రులు రాజు, రాజేశ్వరిలు కారణమని ప్రసన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాంనేని సందీప్ అతడి తల్లిదండ్రులు రాంనేని రాజు, రాజేశ్వరీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రసన్న మృతదేహానికి పంచనామా చేశారు.
ఆదిలాబాద్‌లో అదే రకమైన మరో ఘటన..
జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకన్నారు. అయితే ఇటీవల రవీందర్ వేరే యువతిని వివాహం చేసుకుంటానని గంగుబాయికి తెలిపాడు. దీంతో గంగుబాయి మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఈ నెల 24 పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గంగుబాయి తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్‌పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.