Home /News /crime /

YOUNG GIRL COMMITS SUICIDE IN VIJAYAWADA AFTER RECEIVING PHONE CALLS FROM TWO YOUTH HSN

ఇద్దరు యువకుల నుంచి ఆ యువతికి ఫోన్ కాల్.. మాట్లాడిన తర్వాత రాత్రిపూట ఇంట్లో ఎవరూ లేనిది చూసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడకు చెందిన ఓ యువతి బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆ యువతికి కృష్ణ అనే యువకుడు ఫోన్ చేశాడు. చాలా సేపు మాట్లాడాడు. సాయంత్రం పూట స్వరూప్ అనే మరో యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత..

    విజయవాడ నగరంలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో మరణించింది. ఇంట్లో గొడవలు జరిగిన దాఖలాలు లేవు. తల్లిదండ్రులు కోప్పడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఆమె తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఆమె మధ్యాహ్నం ఓ యువకుడితో ఫోన్ మాట్లాడింది. సాయంత్రం కూడా ఆ యువతికి మరో యువకుడు ఫోన్ చేసి మాట్లాడాడు. ఏం మాట్లాడారో ఏమో కానీ, ఆ స్నేహితులిద్దరు మాట్లిడిన తర్వాత రాత్రిపూట తన గదిలో ఆమె తన చున్నీతో ఉరి వేసుకుని మరణించింది. కుటుంబ సభ్యులు చూసి ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర మనోవేధనను మిగిల్చింది. ఉన్నత చదువులు చదివించామనీ, ప్రేమగా చూసుకున్నామని, ఏ కష్టం వచ్చిందో చెబితే తీర్చేవారమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.



    విజయవాడలోని విద్యాధరపురం లేబర్ కాలనీలో ఓ రైల్వే ఉద్యోగి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆయనకు 21 ఏళ్ల ఓ కూతురు ఉంది. ఆమె గతేడాది కేఎల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. తల్లి కూడా ఆమెతో పాటు ఇంటి వద్దనే ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆ యువతికి కృష్ణ అనే యువకుడు ఫోన్ చేశాడు. చాలా సేపు మాట్లాడాడు. సాయంత్రం పూట స్వరూప్ అనే మరో యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. అతడు కూడా చాలా సేపు ఆమెతో మాట్లాడాడు. ఇంతలో ఏమయిందో ఏమో కానీ ఆమె రాత్రికి రాత్రే ఘోరమైన నిర్ణయం తీసుకుంది.

    రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బెడ్రూంలో ఆమె తన చున్నీతో ఉరి వేసుకుంది. అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన తల్లి, కుమార్తె చేసిన ఘోరాన్ని చూడా పెడబొబ్బలు పెట్టింది. దీంతో కింద అంతస్తులో ఉన్నవారుపైకి వచ్చి చూసి, ఉరి వేసుకున్న యువతిని కిందకు దింపారు. 108 కు ఫోన్ చేశారు. వారువచ్చి ఆ యువతిని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్టుగా ధృవీకరించారు. కూతరి మృతిపై తనకు అనుమానం ఉందని ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమై ఉంటాయా..? అన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆఖరుగా మాట్లాడిన ఇద్దరు యువకులను విచారించే పనిలో పడ్డారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Vijayawada, Wife kill husband

    తదుపరి వార్తలు