Couple found charred to death in burning car : కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో విషాద ఘటన చోటు చేసుకుంది .కారులో మంటలు చెలరేగి నవ దంపతులు సజీవ దహనమయ్యారు. హెగ్గుంజే గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను బెంగళూరుకి చెందినవారుగా గుర్తించారు. అయితే ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగింది
పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన దంపతులు యశ్వంత్(23), జ్యోతి(23) మే 18న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంటర్వ్యూకి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు జ్యోతి తన కుటుంబ సభ్యులతో తెలిపింది. తరగతులకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు యశ్వంత్ చెప్పారు. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో హెబ్బల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు కుటుంబ సభ్యులు. శనివారం వీరు మంగళూరులోని హుస్సేన్ అనే వ్యక్తి వద్ద ఓ కారుని అద్దెకు తీసుకున్నారు.
అయితే ఆదివారం తెల్లవారుజామున ఉడుపి జిల్లాలోని హెగ్గుంజే గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో మంటల్లో కాలిపోతున్న కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. తాము ఘటనా స్థలానికి కారులోని ఇద్దరు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. తమ జీవితాలను ముగిస్తున్నామని వారి తల్లిదండ్రులకు సందేశం పంపించారని తెలిపారు. అయితే, వారి మరణానికి గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నట్లు చెప్పారు. మృతదేహలను పోస్టుమార్టం కోసం మణిపలోని కస్తూర్బా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.