యూట్యూబ్ వీడియోలు చూసి ప్రసవం... తల్లి మృతి!

ఖర్చు తగ్గించుకునేందుకు యూట్యూబ్ వీడియోలతో ప్రసవం చేసుకునేందుకు ప్రణాళిక... తీవ్రరక్తస్రావం కావడంతో తల్లి మృతి!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: July 26, 2018, 2:28 PM IST
యూట్యూబ్ వీడియోలు చూసి ప్రసవం... తల్లి మృతి!
నమూనా చిత్రం
  • Share this:
‘వేదాల్లో అన్ని విషయాలు చెప్పారహే...’ అన్నట్టుగా నేటి యువత ‘ఏదైనా సరే యూట్యూబ్‌లో ఉంటుంది’ అని గుడ్డిగా నమ్ముతున్నారు. యూట్యూబ్ చూసి యోగా చేస్తున్నాం, యూట్యూబ్ వీడియోలు చూసి వంట నేర్చుకుంటున్నాం... మరి అలాంటిది ప్రసవం చేయలేమా... అనే వింత ఆలోచన వచ్చింది ఓ జంటకి. ఆ పిచ్చి ఆలోచన కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది.

తమిళనాడులోని తిరుపూర్‌లో రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన 28 ఏళ్ల కృతిక ఓ ప్రైవేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. ఆమె భర్త ఓ ప్రైవేటు ఉద్యోగి. ఈ దంపతులకు మొదటి సంతానంగా మూడేళ్ల కిందటే ఓ పాప జన్మించింది. రెండోసారి గర్భవతి అయిన కృతికకి, ఆమె భర్తకి కొద్దికాలం కిందటే ఓ వింత ఆలోచన వచ్చింది. ఆసుపత్రి ఖర్చులు తగ్గించుకునేందుకు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంట్లోనే ప్రసవం చేయాలని నిర్ణయించుకున్నారు. జూలై 22న ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ‘డెలివరీ సమయంలో గర్భవతికి ఎలా సాయం చేయాలి? నార్మల్ డెలివరీ ఎలా చేయాలి?’ వంటి వీడియోలు చేస్తూ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారిద్దరూ. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ప్రసవం సీన్ వీరి ఆలోచనకి కారణంగా తెలుస్తోంది.

కానీ ఇంత సేపటికీ ప్రసవం కాలేదు. పురిటినొప్పులతో గంటన్నరపాటు నరకయాతన అనుభవించిన కృతిక... ఓ బిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది. దాంతో ఏం చేయాలో తెలియని ఆమె భర్త వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ‘పురిటి నొప్పులు 2 గంటలకు మొదలయ్యాయని... 3:30 దాకా ఏం చేస్తున్నారని’ అతన్ని నిలదీయగా అసలు విషయం బయటికొచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు. కృతిక స్నేహితురాలు లావణ్య, ప్రసవాలు చేస్తుండేది. ఆమె సలహాతోనే కృతిక దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
Published by: Ramu Chinthakindhi
First published: July 26, 2018, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading