Home /News /crime /

YOUNG BOY INNER PARTS CUT DUE TO GET LOVE MARRIAGE IN DELHI VRY

crime :ఇలా కూడా ఉంటారా...? కూతురును ఎత్తుకెళ్లాడని.. మర్మాంగాలు కట్..

crime

crime

crime : ఆధునిక సమాజంలో ఓ వైపు ప్రేమ పెళ్లిలు పెరుగుతుంటే మరోవైపు అదే స్థాయిలో తల్లిదండ్రులు కూడా వాటిని వ్యతిరేకిస్తూ తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారు.

    ఇలా ఇద్దరు ప్రేమికులు ఇంట్లోనుండి పారిపోయిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు దారుణంగా ప్రవర్తించారు. పారిపోయిన జంటను తీసుకువచ్చి యువకుడిపై కిరాతంగా దాడి చేశారు. మర్మంగాలు కోశారు. దీంతో కేసు సంచలనంగా మారింది. మరోవైపు ఈ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. బాధితుడికి సరైన న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవరించిన ఇద్దరు పోలీసులపై వేటు పడింది.

    వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని సాగర్‌పూర్‌లో యువతీ యువకులు ఇద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వారి పెళ్లికి ఇంట్లోవారు ఒప్పకునే పరిస్థితి కనిపించకపోవడంతో... ఇటీవల ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు.. స్నేహితుల అండతో.. స్థానిక కోర్టులో పెళ్లి చేసుకున్నారు. కోర్టులోనే పెళ్లి చేసుకున్నామనే ధైర్యంతోనే రెండు రోజుల క్రితం నవ దంపతులు... కలిసి కేసుకు సంబంధించి రాజౌరీ గార్డెన్ పోలీస్ స్టేషన్‌కు స్టేట్‌మెంట్ల రికార్డు కోసం వెళ్లారు. అయితే.. అప్పటికే గుర్రుగా యువతి తల్లిదండ్రులు ఆ సమయంలో పోలీస్ స్టేషన్ బయటే కాపుకాశారు.. అనంతరం యువతి కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని సాగర్‌పూర్‌లోని వారింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత యువతి తండ్రి, సోదరుడు, మామ కలిసి యువకుడిపై దాడిచేశారు. ఆ తర్వాత యువకుడి మర్మాంగాలను కోసేశారు. బాధితుడు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Nalgonda : ట్రాన్స్‌జెండర్స్‌తో ఫ్రెండ్‌షిప్.. నమ్మిన వారే నరకం చూపించారు.. తల, మొండెం వేరు చేసి

    మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలో  గడిచిన ఇరవైనాలుగు గంటల్లోనే నాలుగు సాముహిక అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. ఇలా ఓ ఘటనలో రాష్ట్రంలోని మాల్‌పూర్ లో ఓ భర్త తన సొంత భార్యనే అయిదు వేల రూపాయలు తీసుకుని ఇద్దరు బయటి వ్యక్తులకు అప్పగించాడు. భర్త ఒప్పందం ప్రకారం అయిదు వేల రూపాయలకు ఇద్దరు వ్యక్తులతో ఆమె గడపాలి. దీంతో డబ్బులు ఇచ్చిన వారు ఆమెకు తెలియకుండానే ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో వారితో గడపమని భర్త చెప్పడంతో ఆమె ఖంగుతింది.. అందుకు నిరాకరించింది. దీంతో భర్తతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెను విపరీతంగా కొట్టారు. అడ్డువచ్చి ఆమె కొడుకును కూడా విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత బయటి తీసుకుని వెళ్లారు. ఒప్పందం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఆమెపై బలాత్కారం చేశారు.

    Guest lecturer Suicide : ఇద్దరు గెస్ట్ లెక్చరర్ల మధ్య అక్రమ సంబంధం.. లేడీ లెక్చరర్ బెదిరింపులు

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Delhi

    తదుపరి వార్తలు