Home /News /crime /

YOUNG BOY ARRESTED BY POLICE BECAUSE HE WROTE EXAM IN LADY GETUP FOR HIS GIRL FRIEND NGS

Exams: పరీక్ష హాల్లో ప్రేయసి కోసం ప్రియుడు చేసిన పనితో అంతా షాక్.. అంతమంది మధ్య ఎలా సాధ్యమైంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ కోసం వెంటపడి వేధించే వాళ్లు ఉన్నారు.. కాదంటే ప్రాణాలు తీసే ఉన్మాదులు కూడా ఉన్నారు. ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేయసి కోసం ఎవరూ చేయని పని చేశాడు.. కానీ చివరికి జైలు పాలయ్యాడు.

  గంగోత్రి సినిమాలో సీన్ ను డెన్మార్క్ లో కాపీ కొట్టారు. అది కూడా ఎవరికీ అనుమానం రాకుండా మాస్టర్ ప్లాన్ వేశారు.. మూడు రోజులుగా అందరూ చూస్తుండగానే.. పరీక్ష హాల్లో అలా చేస్తున్నా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రేమలో పడి చదువుని నిర్లక్ష్యం చేసిన వాళ్లు ఉంటారు. పరీక్షలు ఎగ్గొట్టి తిరిగిన జంటలు చాలానే ఉంటాయి. కాని ఓ ప్రేమ జంట ఎవరూ చేయని పని చేసి అందరికీ షాక్ ఇచ్చాంది. ముఖ్యంగా ఆ బాయ్ ఫ్రెండ్ చేసిన సాహసం వైరల్ గా మారింది. అతడు చేసింది చట్ట రీత్య నేరమే అయినా.. అమ్మాయిలు మాత్రం బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వే అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిదంటే.. ఓ గర్ల్‌ఫ్రెండ్‌ కోసం.. ఆమె బాయ్ ఫ్రెండ్ అమ్మాయి మారువేషం వేసుకొని పరీక్ష హాల్‌లో అడ్డంగా దొరికిపోయాడో ఓ యువకుడు. చివరికి ఇద్దరూ కటకటాలపాలయ్యారు.. అమ్మాయి కోసం అతడు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయ్యింది. పాపం ఇద్దరూ ఇప్పుడు జైలు జీవితం గడపాల్సి వస్తోంది..

  డెన్మార్క్ లోని సెనెగల్‌లోని డైయోర్బెల్ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది. అసలు ఏం జరిగింది అంటే.. 22 ఏళ్ల ఖాదీం.. తన గర్ల్‌ఫ్రెండ్‌ 19 ఏళ్ల గంగూ కోసం పెద్ద రిస్క్ చేశాడు. అక్కడ ప్రస్తుతం హై స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే గంగూకి ఇంగ్లిష్‌లో అంతగా పట్టులేదు.. కానీ ఆమె తను ఎలాగైనా పాస్ చేయాలని.. తన కోసం ఏదైనా చేయాలి అంటూ ప్రియుడ్ని కోరింది. ప్రేయసి అంత ముద్దుగా అడిగేసరికి కాదనలేకపోయిన ఖాదీం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.. ఆమెను ఎలాగైనా పాస్ చేయించాలి అనుకున్నాడు..

  తన ప్రేయసి సలహా మేరకు అబ్బాయి కాస్త అమ్మాయి గెటప్ వేసుకున్నాడు. పొడువైన జట్టున్న విగ్‌, చెవిరింగులు, మేకప్, డ్రెస్‌తో పాటు ముఖాన్ని కప్పిపుచ్చేందుకు తలపై సంప్రదాయ స్కార్ఫ్‌తో రెడీ అయ్యాడు. అచ్చం తనలానే.. చూసే వారికి ఏ మాత్రం అనుమానం రాకుండా బాయ్ ఫ్రెండ్ ను రెడీ చేసింది గంగూ. దీంతో అలానే పరిక్షలు రాస్తూ వచ్చాడు. మూడు రోజులు ఎవరికి అనుమానం రాకుండా.. ఎవరి కంటా పడకుండా.. అందరినీ మాయచేస్తూ వచ్చాడు ఖాదీం. ఇలా మూడు రోజుల వరకూ వారి ఆటలు సాఫీగానే సాగాయి. ఇక నాలుగో రోజు పరీక్ష అప్పుడు పరీక్ష హాల్‌కి వచ్చిన ఇన్విజిలేటర్‌కి ఖాదీం కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే అతడి గురించి పై అధికారులకు సమాచారమిచ్చారు. ఆపై వారు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే పరీక్ష హాల్‌కు చేరుకొని ముందుగా ఖాదీంను డీటైన్‌ చేశారు. తరువాత ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. తాను ఇలా చేయడానికి కారణం తన గర్ల్‌ఫ్రెండ్‌ అని, ఆమెకు ఇంగ్లిష్‌ రాకపోవడంతో ఎలాగైనా తను పరీక్షల్లో పాస్‌ చేయాలనే ఉద్దేశంతో ఆమె చెప్పినట్టు చేశానని తప్పుని ఒప్పుకున్నాడు ఖాదీం. తరువాత ఉన్నతాధికారులు వారిని రెండేళ్ల పాటు ఎటువంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. న్యాయస్థానం ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే మూడు రోజుల పాటు.. ఒక అబ్బాయి అయి ఉండి అమ్మాయి వేషంలో వెళ్లి పరీక్షలు రాస్తున్న ఎందుకు గుర్తించలేకోపయారు..? ఇన్విజిలేటర్ తో సహా తోటి విద్యార్థులు అంతా ఉండగానే అది ఎలా సాధ్యమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Crime news, International news, World news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు