పెళ్లైన తర్వాత కూడా ప్రేయసితో సహజీవనం చేయొచ్చు... హైకోర్టు సంచలన తీర్పు...

పెళ్లై, పిల్లలు కూడా పుట్టిన తర్వాత మరో యువతితో భర్త ప్రేమాయణం... డేటింగ్ చేస్తూ, సహజీవనాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్న జంట...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 10:16 PM IST
పెళ్లైన తర్వాత కూడా ప్రేయసితో సహజీవనం చేయొచ్చు... హైకోర్టు సంచలన తీర్పు...
పెళ్లైన తర్వాత కూడా ప్రేయసితో సహజీవనం చేయొచ్చుట (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 10:16 PM IST
న్యాయస్థానాలు వెలువరించే తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి. వివాహేతర సంబంధం నేరం కాదంటూ, అదో శారీరక వాంఛగా చూడాలంటూ సెక్షన్ 497ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం తీర్పు... దేశంలో ఈ విధమైన లైంగిక నేరాలు పెరిగిపోవడానికి ఓ విధంగా కారణమైంది కూడా. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర న్యాయస్థానం కూడా ఇలాంటి వివాదాస్పద తీర్పును వెలువరించింది. కష్టసుఖాల్లో తోడుగా ఉంటానంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చిన అమ్మాయితో ఆ సంబంధాన్ని కొనసాగించడం తప్పు కాదంటూ సంచలన తీర్పు వెలువరించింది రాజస్థాన్ కోర్టు. ఇంతకీ ఆ కేసు ఏంటంటే... మొయినుద్దీన్ అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. 11 ఏళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే ప్రేమ ఎవ్వరి మీద, ఎప్పుడు పుడుతుందో తెలియదన్నట్టుగా పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత మొయినుద్దీన్‌కు, పాల్ సోనీ అనే 26 ఏళ్ల అమ్మాయి మీద మనసు మళ్లింది. ఆమె మీద మొయిన్‌ను ఇష్టపడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెళ్లై, పిల్లలున్న తర్వాత మళ్లీ పెళ్లి అనే సరికి అమ్మాయి కుటుంబంతో పాటు మొయిన్ కుటుంబంలోనూ గొడవలు జరిగాయి. అయితే మొయిన్, సోనీలు అవేమీ పట్టనట్టుగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ సహజీవనాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నారు. సోనీ ఇంట్లో విషయం తెలయడంతో పెళ్లై, పిల్లలున్న వాడితో కలిసి ఉంటున్నావా? అని ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయి, బంధించేశారు. దీంతో తన ప్రేయసిని విడిపించాలంటూ మొయిన్... కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు, మొయిన్, సోనీలు చేసిన దాంట్లో తప్పేం లేదంటూ తేల్చేసింది. మానసిక పరిపక్వత కలిగిన ఇద్దరు మేజర్లు, వారికి ఇష్టమైతే కలిసి జీవించొచ్చు... అంటూ సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. వివాహ బంధానికి విలువిచ్చే దేశంతో ఇలాంటి తీర్పు వెలువరించే, వివాహేతర సంబంధాలు విచ్ఛలవిడిగా పెరిగిపోతాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కేసు దుమారం రేపుతోంది.





First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...