హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన డ్రామా నెవర్ బిఫోర్..

ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన డ్రామా నెవర్ బిఫోర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెగిపోయిన పురుషాంగం, బెడ్ నిండా రక్తంతో బెంబేలెత్తిన అతను.. ప్రేయసి కోసం చూడగా అప్పటికే ఆమె అక్కణ్నుంచి జారుకుంది. సహాయం కోసం అతను గట్టిగా కేకలు వేసినా చుట్టుపక్కల వాళ్లు స్పందించలేదు. దీంతో అతను ప్రియురాలికి ఫోన్ చేయగా..

విద్యావంతురాలైన ఆమె యోగా టీచర్ గా పనిచేస్తోంది.. అదే ప్రొఫెషన్ లో ఉంటూ చదువకుంటోన్న యువకుడితో పరిచయం ఏర్పడింది.. అటు యోగా క్లాసులు.. ఇటు ప్రేమ కబుర్లతో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు.. ఆమె ఫ్లాట్ కు అతను.. అతని గదికి ఆమె తరచూ వస్తూ పోతుండటం, వ్యవహారం దాదాపు సహజీవనం స్థాయికి వెళ్లింది. అంతా బాగుండగానే ఆమె అనూహ్యచర్యకు పాల్పడింది. మత్తుమందు ఇచ్చి.. ప్రియుడి పురుషాంగాన్ని కోసేసి సైలెంట్ గా వెళ్లిపోయింది. రక్తం నిండిన మంచంలో కదల్లేని స్థితిలో అతనికి ఎవరూ సహాయంగా రాకపోయేసరికి మళ్లీ ఆమెనే మానవత్వం చూపించింది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ సిటీలో చోటుచేసుకుందీ ఉదంతం..

జైపూర్ సిటీ శివారు భంక్రోటాలో యోగా టీచర్ గా పనిచేస్తోన్న యువకుడుకి అదే ప్రొఫెషన్ లో ఉన్న యువతి పరిచయమైంది. ఇద్దరి మధ్యా ప్రేమ పెరగడంతో వీలైనప్పుడల్లా కలిసేవారు. చాలా సార్లు ఒకే గదిలో భోంచేసి, ఒకటిగా నిద్రించేవాళ్లు. రెండ్రోజుల కిందట తీవ్ర గాయాలతో అతను జైపూర్ లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి బెడ్ పై నుంచే పోలీసులను ఆశ్రయించాడు. యోగా టీచర్ గానే పనిచేస్తోన్న ప్రియురాలే.. తన పురుషాంగాన్ని బ్లేడుతో కోసేసిందని అతను ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె ఆ పని చేసిన తర్వాత సారీ కూడా చెప్పిందని, ఆస్పత్రికి కూడా ఆమెనే తీసుకొచ్చిందని యువకుడు చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు..

acid attack : ఇద్దరు పిల్లల తల్లి ప్రేమ బాగోతం -ఆ పనికి యువకుడు ఒప్పుకోలేదని..


రెండ్రోజుల కిందట.. యోగా క్లాస్ ముగించుకుని వెళుతున్న తనకు యువతి ఫోన్ చేసి కూరగాలు తెమమ్మంది. ఆ మేరకు ఆమె ఫ్లాట్ కు వెళ్లాడు. వంట పూర్తయ్యాక ఇద్దరం కలిసే భోజనం చేశారు. ఆ తర్వాత యువకుడు తన గదికి వెళ్లేందుకు బయలుదేరగా, నేను వస్తానని ఆమె చెప్పింది. అలా ఇద్దరూ కలిసి తమ కారులో అబ్బాయి గదికి చేరుకున్నారు. అయితే, భోజనం చేసినప్పటి నుంచి మత్తుగా అనిపించడంతో అతను ఆదమరిచి నిద్రపోయాడు. తెల్లవారుజామున రెండు గంటలకు మెలకువ రాగా.. నడుము కింద విపరీతమైన నొప్పి అనిపించింది.. దాదాపు కదల్లేని స్థితిలో బెడ్ లైట్ వేసుకుని చూడగా.. అతని పురుషాంగం సగానికిపైగా తెగిపోయి కనిపించింది..

Hyderabad : అమ్మమ్మతో అక్రమ సంబంధం.. 11 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం -80ఏళ్ల వృద్దుడి అఘాయిత్యం


తెగిపోయిన పురుషాంగం, బెడ్ నిండా రక్తంతో బెంబేలెత్తిన అతను.. ప్రేయసి కోసం చూడగా అప్పటికే ఆమె అక్కణ్నుంచి జారుకుంది. సహాయం కోసం అతను గట్టిగా కేకలు వేసినా చుట్టుపక్కల వాళ్లు స్పందించలేదు. దీంతో అతను ప్రియురాలికి ఫోన్ చేయగా.. ‘ఐయామ్ సారీ, నన్ను క్షమించు’అని ఆమె బదులిచ్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో, జరిగిందేదో జరిగిపోయింది, ఆస్పత్రిలో చేర్పించాలని బాధితుడు అభ్యర్థించడంతో ఆ ప్రియురాలు సరేనంది. మళ్లీ యువకుడి ఫ్లాట్ కు వచ్చి అతణ్ని మోసుకుంటూ కారులో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం బాధితుడికి చికిత్స కొనసాగుతున్నదని, అతని ఫిర్యాదు మేరకు యువతిని అదుపులోకి తీసుకున్నామని, ఆమె అసలీ పని ఎందుకు చేసిందో ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.

First published:

Tags: Crime news, Jaipur, Rajasthan

ఉత్తమ కథలు