Honey Singh case: యో యో హనీ సింగ్​ కోర్టుకు హాజరుకావాల్సిందే.. లాయర్లకు ఆదేశాలు జారీచేసిన ఢిల్లీ కోర్టు

యోయో హనీసింగ్ (Yo Yo Honey Singh)

హానీ సింగ్​ తనని హింసిస్తున్నారు అంటూ తన భార్య(wife) షాలినీ(20) ఢిల్లీ కోర్టు(court)లో ఇటీవల గృహహింస కేసు(case) పెట్టింది. అయితే ఈ కేసు ఆగస్టు 28వ తేదీన విచారణ(hearing)కు వచ్చింది. వ్యక్తిగతంగా హానీ సింగ్​ హాజరుకాకపోవడంతో తన సంపాదన వివరాలు.. ఇన్​కం ట్యాక్స్(Income tax)​ వివరాలు.. తన ఆరోగ్య సంబంధిత మెడికల్​ డాక్యుమెంట్‌లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

 • Share this:
  ఒకప్పుడు నార్త్​ ఇండియానే కాదు.. సౌత్​ ఇండియాను కూడా ఉర్రూతలూగించిన ‘లుంగీ డ్యాన్స్’ పాట గుర్తుందా.. షారుక్​ఖాన్​తో స్టెప్పులేయించిన పాట. ఆ పాటకు సంగీతం(music) అందించడమే కాదు, ప్రైవేట్​గా కూడా అనేక పాటలకు తన గాత్రం అందించడం, సంగీతం సమకూర్చడం చేశారు.. సంగీత దర్శకుడు, ర్యాపర్ (rapper) ‘యో యో హనీ సింగ్(YO YO Honey Singh)’. ఆయన చేసిన పాటలు(songs) చాలా వరకు పాపులర్ ​(popular) అయ్యాయి. దీంతో హనీ సింగ్(honey Singh)​ మంచి క్రేజ్(craze) సంపాదించుకున్నారు. అయితే తాజాగా యో యో హానీ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన తనని హింసిస్తున్నారు అంటూ తన భార్య(wife) షాలినీ(20) ఢిల్లీ కోర్టు(court)లో ఇటీవల గృహహింస కేసు(case) పెట్టింది. అయితే ఈ కేసు ఆగస్టు 28వ తేదీన విచారణ(hearing)కు వచ్చింది. వ్యక్తిగతంగా హానీ సింగ్​ హాజరుకాకపోవడంతో తన సంపాదన వివరాలు.. ఇన్​కం ట్యాక్స్(Income tax)​ వివరాలు.. తన ఆరోగ్య సంబంధిత మెడికల్​ డాక్యుమెంట్‌లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్టేట్​మెంట్​ ఇచ్చింది. కాగా, గతంలోనే తన భార్య పెట్టిన కేసుపై హనీ సింగ్​ స్పందించారు.

  తన భర్త  హనీ సింగ్ తనని లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తూ భార్య శాలిని తల్వార్ ఢిల్లీలో తీజ్ హజారీ కోర్టులో గృహహింస నిరోధక చట్టం కింద ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి హనీ సింగ్ మోసం చేశాడని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు శాలిని తరపు న్యాయవాదులు సందీప్ కౌర్, అపూర్వ పాండే, జీజీ కశ్యప్ కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తానియా సింగ్.. హనీ సింగ్ కి నోటీస్ జారీచేశారు. హనీ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించాల్సిందిగా నోటీసులో పేర్కొంది. అయితే ఈనెల 28న కోర్టు ముందుకు కేసు విచారణ జరిగింది. హనీ సింగ్​ను తన ఐటీ రిటర్న్స్(Income tax returns)​, మెడికల్ రిపోర్టు(medical report)లను కోర్టు ముందు సమర్పించాలని ఆయన తరఫు లాయర్‌లకు సూచించినట్లు ఏఎన్​ఐ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే వచ్చే విచారణలో అంటే సెప్టెంబర్​ 3న జరిగే విచారణకు హనీసింగ్​ హాజరు కావాల్సిందేనని కోర్టు తెలిపినట్లు ఏఎన్​ఐ తెలిపింది.  శాలినీ ఆరోపణలపై గతంలో స్పందించిన యో యో సింగ్ అప్పట్లో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ‘‘నా భార్య షాలిని తల్వార్‌ నాపై, నా కుటుంబంపై మోపిన అసత్య ఆరోపణలు విని చాలా బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆమె చెప్పే వి అస్సలు బాగా లేవు. గతంలో నా సంగీతం మీద, ఆరోగ్యం మీద ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ వాటిపై నేనెప్పుడూ స్పందించలేదు. నాపై వ్యతిరేక ప్రచారం జరిగినా ఎలాంటి ప్రెస్‌నోట్‌ జారీ చేయలేదు. కానీ ఈసారి మౌనంగా ఉండటం కరెక్ట్‌ కాదనిపిస్తోంది. ఎందుకంటే నాకు ఎంతగానో అండగా నిలబడ్డ నా వృద్ధ తల్లిదండ్రులు, చెల్లి మీద ఆమె నీచమైన ఆరోపణలు చేస్తోంది. ఇవి మా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని నోట్‌లో పేర్కొన్నాడు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న యో యో సింగ్  త్వరలోనే నిజం బయటపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అప్పటి వరకూ తన గురించి, తన కుటుంబం గురించి ఎలాంటి నిర్ధారణకు రావద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా అని ట్వీట్ (tweet) చేశాడు.
  Published by:Prabhakar Vaddi
  First published: