ఫేక్ న్యూస్ ప్రచారంపై పోలీసులను ఆశ్రయించిన ఎస్ బ్యాంక్...

వాటాదారుల ప్రయోజనార్థం ఈ ఫిర్యాదు చేసినట్టు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. వాట్సాప్, అలాగే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బ్యాంక్ ఆర్థిక స్థితిగతుల గురించి నకిలీ వార్తలు, పుకార్లు ప్రచారం చేయడంతో సంబంధిత వర్గాలకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.

news18-telugu
Updated: October 7, 2019, 11:06 PM IST
ఫేక్ న్యూస్ ప్రచారంపై పోలీసులను ఆశ్రయించిన ఎస్ బ్యాంక్...
(Photo Reuters)
  • Share this:
బ్యాంక్ ఆర్థిక పరిస్థితి గురించి పుకార్లు, నకిలీ వార్తలు సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఎస్ బ్యాంక్ ముంబై పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఒక ప్రకటన ద్వారా బ్యాంకు సమాచారం ఇచ్చింది. వాటాదారుల ప్రయోజనార్థం ఈ ఫిర్యాదు చేసినట్టు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. వాట్సాప్, అలాగే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బ్యాంక్ ఆర్థిక స్థితిగతుల గురించి నకిలీ వార్తలు, పుకార్లు ప్రచారం చేయడంతో సంబంధిత వర్గాలకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. డిపాజిటర్లలో ఆందోళన సృష్టించేందుకు వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో పుకార్లు వచ్చాయి. విలువైన వాటాదారులందరి ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని బ్యాంక్ వెల్లడించింది.

First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...