YCP MLC: ఏపీలో సంచలనంగా మారిన ఎమ్మెల్యే డ్రైవర్ హత్య కేసు మిస్టరీ వీడినట్టేనా..? పోస్టు మార్టం రిపోర్ట్ తరువాత.. నిందితుడే హంతకుడని పోలీసులు నిర్ధారించారా..? ఇంతకీ పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందు..? డ్రైవర్ ను అంత కిరాతకంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.
YCP MLC: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసు సంచలనంగా మారింది. పొలిటికల్ గా కాక రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు (MLC Anantababu) మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ (Kakinada) లో తీవ్ర ఉద్రిక్తతలు కనిపించాయి. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం భార్య అంగీకారంతో మృతదేహానికి పోస్టుమార్టంకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబే హంతకుడు అంటున్నారు పోలీసులు. అందుకే అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కోసం.. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ, ఎల్లవరం, రాజానగరంలలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు అనంతబాబును అరెస్టు చూపించే అవకాశం కనిపిస్తోంది. అనంత బాబును పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తున్నాయి. ప్రధాన ముద్దాయిగా కుటుంబ సభ్యులు అనంత బాబు పేరును చెప్పడంతో.. సెక్షన్ 302 కింద కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.
ఈ పోస్టు మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నట్టు సమాచారం. ఇది ముమ్మాటికీ హత్య అని తేలినట్టు పోలీసుల వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా డ్రైవర్ మర్మావయాల దగ్గర కొట్టడంతోనే.. సుబ్రహ్మణ్యం చనిపోయినట్టు పోస్టు మార్టంలో నిర్ధారించినట్టు సామాచారం. ప్రస్తుతం సాక్ష్యాలు అన్ని అతడికి ప్రతికూలంగానే ఉన్నాయి. సీఎం జగన్ సైతం.. సొంత పార్టీ నేత అయినా తప్పు చేస్తే.. కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు అతడిని ఏ క్షణమైనా అదుపులోకి తీసుకోవచ్చు.. మరోవైపు గొల్లల మామిడాడలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరగనున్నాయి. మృతుడి భార్య అపర్ణకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామి ఇచ్చారు.
ఈ కేసులో సుబ్రహ్మణ్యం తల్లి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ. 20న రాత్రి 7.30కి మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు చనిపోయాడని చెప్పారు. ఆస్పత్రి నుంచి ఇంటికి ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ తీసుకు వచ్చారు. నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ అక్కడే ఉన్నారని తెలిపారు. సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ. 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యకు అక్రమ సంబంధమే ప్రధాన కారణం అయి ఉంటుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. అందుకే డ్రైవర్ మర్మాంగాలపై తీవ్రంగా దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.