హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: యాదాద్రి జిల్లాలో మహిళను హత్య చేసి అత్యాచారం..నిందితుడ్ని పట్టించిన చెప్పులు

Telangana: యాదాద్రి జిల్లాలో మహిళను హత్య చేసి అత్యాచారం..నిందితుడ్ని పట్టించిన చెప్పులు

(కిరాతకుడు,కామాంధుడు)

(కిరాతకుడు,కామాంధుడు)

Crime news:వివాహితపై కన్నేసిన ఓ కామాంధుడు అత్యాచారం చేయాలని ప్రయత్నించి హత్య చేశాడు. చంపిన తర్వాత తన కామవాంఛ తీర్చుకొని మృతురాలి నగలు దోచుకెళ్లాడు. మూడు నేరాలు చేసిన ఆ కిరాతకుడు ఆ సాక్ష్యంతో దొరికిపోయాడు.

అత్యాచారం, హత్య, దోపిడీ ఒకేసారి ఈ మూడు నేరాలు చేసిన కిరాతకుడు..చిన్న క్లూతో పోలీసులకు దొరికిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri bhuvanagiri) చౌటుప్పల్(Chautaupal)మండలం తూప్రాన్‌పేట(Tupranpet)లో వివాహిత హత్య జరిగింది. హత్యకంటే ముందు ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె ఒంటిపై నగలు ఎత్తుకెళ్లాడు దుండగుడు. తూప్రాన్‌పేట శివార్లలోని మూతపడిన గోదామ్‌లో నాగర్‌కర్నూలు(Nagarkurnool)జిల్లా కోడూర్‌(Kodur)మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. మృతురాలి భర్త దగ్గరలోని ఓ కాలేజీలో సెక్యురిటీ గార్డ్‌(Security Guard‌)గా పనిచేస్తున్నాడు. మృతురాలు నివసిస్తున్న గోదామ్‌ పక్కనే డెయిరీ లేబర్ క్యాంప్(Dairy Labor Camp)ఉంది. అక్కడ గదుల్లో చాలామంది అద్దెకు ఉంటూ పనులు చేసుకుంటున్నారు. డెయిరీ లేబర్‌ రూముల్లో అద్దెకు ఉంటున్న హరీష్‌గౌడ్ అనే పాతికేళ్ల యువకుడు గోదామ్‌లో ఉంటున్న మహిళను చూసి మనసుపడ్డాడు. ఈనెల 9వ తేదిన సాయంత్రం సమయంలో భర్త లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో కొట్టి చంపాడు. మృతి చెందిన గిరిజన మహిళ(Tribal woman)పై అత్యాచారం చేసి ఆమె ఒంటిపైనున్న నగలు, వెండి పట్టీలు తీసుకొని పారిపోయాడు. నేరస్తుడు ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినప్పటికి గోదామ్‌లోకి వచ్చే ముందు పక్కనే ఉన్న తమ డెయిరీ లేబర్‌ గదులకు మధ్య ఉన్న గోడ దూకడానికి చెప్పులు వదిలి వచ్చాడు.

వాడో కామాంధుడు, కిరాతకుడు..

మృతురాలి భర్త ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హత్య జరిగిన గోదామ్‌తో పాటు పక్కనే ఉన్న ప్రహరిగోడ దగ్గర సాక్ష్యాధారల కోసం వెదుకుతుండగా నిందితుడు హరీష్‌గౌడ్ వదిలివెళ్లిన చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సిమెంట్‌ ఉండటంతో పక్కనే ఉన్న డెయిరీ లేబర్‌ రూంలో ఉన్న వ్యక్తులను విచారించారు. గిరిజన యువతిని హత్య చేసిన నిందితుడు సైతం అక్కడే ఉండటంతో అతడ్ని ప్రశ్నించారు పోలీసులు. ఆ సమయంలో హరీష్‌గౌడ్‌ కాళ్లకు చెప్పులు లేకపోవడంతో ..ఖచ్చితంగా అతనే హత్య చేశాడని నిర్ధారించుకున్నారు. హరీష్‌గౌడ్‌ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా మహిళను చంపి, అత్యాచారం చేసినట్లుగా అంగీకరించినట్లుగా ఏసీపీ ఉదయ్‌రెడ్డి తెలిపారు.

చిన్న క్లూతో దొరికిపోయాడు..

నిందితుడు సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం వెంకటాపురానికి చెందిన ఈడిగి హరీశ్‌ గౌడ్‌ అని వివరాలు వెల్లడించారు. పెళ్లి కాకపోవడంతో తూప్రాన్‌పేటకు 15రోజుల క్రితం పనుల కోసం వచ్చాడు. తాపీ మేస్త్రీ పని చేస్తూ డెయిరీ లేబర్‌ క్యాంప్‌ గదుల్లో రెంట్‌కు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర నుంచి మృతురాలి దగ్గర కాజేసిన నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అటుపై కోర్టులో హాజరుపరిచి నల్లగొండ జైలుకు తరలించారు.

First published:

Tags: Nalgonda police, Rape on women

ఉత్తమ కథలు