జన నాట్యమండలి సీనియర్ కళాకారుడు, తెలంగాణ (Telangana) ఉద్యమకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఉంటున్నఅతడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నిమ్స్ దవాఖాన (Nims Hospital) లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో రాత్రి తుది శ్వాస విడిచాడు. తెలంగాణోద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ప్రజా కవిగా, జన నాట్యమండలిలో చురుకైన పాత్రతోపాటు తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమికను పోషించారు.
ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం హన్మాపురం. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆయనకు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రి చేరిన కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జన నాట్య మండలి, కళామతల్లి కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపుతూ ఆశృనివాళి అర్పిస్తున్నారు.
మరో ఘనటలో..
ఇదిలా ఉండగా.. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కారు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లికి చెందిన గౌస్(34) ఎన్నెపల్లిలో మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఎన్నేపల్లి నుంచి అతడు వికారాబాద్ వెళ్లేందుకు ఒక బైక్‌ను లిప్ట్ అడిగాడు. అక్కడ నుంచి
వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోకి రావడంతో రెండు వాహనాలు ఢీకొని కిందపడిపోయారు. బైక్‌పై వస్తున్న ఎన్నెపల్లికి చెందిన గౌస్ పై నుంచి వికారాబాద్ సూపరింటెండెంట్ వరప్రసాద్ కారు వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. గౌస్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని.. వాహనం నడిపే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో కుటుంబసభ్యులకు తీవ్ర శోకం మిగిల్చవద్దని పోలీసులు తెలిపారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. హెల్మెట్ ధరించడంతో పాటు.. కరోనా నిబంధనలు కూడా పాటించాలని పోలీసులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Road accident