ప్రియురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని హత్య.. పట్టిచ్చిన చేతి కడియం..

జూలై 5న గాజువాక దరి గ్లోబెక్స్ షాపింగ్ మాల్ వెనుక ఉన్న మూతపడిన చేపల కంపెనీలోకి గణేష్‌కు మాయమాటలు చెప్పి తీసుకొచ్చారు. అక్కడ వారి ప్రణాళిక ప్రకారమే.. గణేష్‌కు పూటుగా మద్యం తాగించారు.

news18-telugu
Updated: July 23, 2020, 8:49 AM IST
ప్రియురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని హత్య.. పట్టిచ్చిన చేతి కడియం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారిద్దరూ స్నేహితులు. నిత్యం కలిసే తిరుగుతారు. ఒకే మంచం.. ఒకే కంచం అన్నట్టుగా ఉంటారు. అలాంటి వారి స్నేహా బంధాన్ని ఓ మహిళ పట్ల కలిగిన చెడు ఆలోచన అంతం చేసింది. ఫలితంగా స్నేహితుడినే చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో కాస్త భిన్నంగా ఆలోచించిన మాటలు లేకపోయినా.. స్నేహితుడైతే.. కళ్ల ముందే ప్రాణాలతో తిరిగేవాడు. కానీ తన ప్రేయసితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ప్రియురాలితో కలిసి స్నేహితుడికి పూటుగా మద్యం తాగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపై కర్రతో దాడి చేశారు. కింద పడిపోయిన స్నేహితుడి మెడకు ప్రియుడు బెల్టు చూట్టి చంపుతుండగా, ప్రియురాలు అతడి కాళ్లు అదిమి పట్టుకుని సహకరించింది. ఫలితంగా క్షణాల్లో స్నేహితుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన ఈ నెల 5న జరిగింది.

కాగా 13వ తేదీన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా పోలీసులు ఆ హత్య కేసును చేధించారు. ఇందులో కోసమెరుపు ఏంటంటే.. హత్య చేసిన నిందితులను మృతదేహానికి ఉన్న చేతి కడియం, వాచీ పట్టించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని మింది సమీప గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుర్రం గణేష్, గుర్రాల జోగారావు మిత్రులు. రోజూ మద్యం తాగి తిరుగుతుంటారు. ఇంటికి సైతం వారం పదిరోజులకోసారి వెళుతుంటారు. అయితే గుర్రాల జోగారావు.. మల్కాపురం ప్రాంతానికి చెందిన దీనా అలియాస్ స్వాతితో ప్రేమలో పడ్డాడు. స్వాతితో వివాహం చేసుకోవాలని జోగారావు నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో గణేష్ పలుమార్లు స్వాతితో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై ఎన్నిసార్లు గణేష్‌కు మంచిగా చెప్పినా.. అతడు ప్రియురాలితో అసభ్యంగా ప్రవర్తించడం మానలేదు. దీంతో విసిగిపోయిన ప్రేమికులిద్దరూ గణేష్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే జోగారావు, స్వాతి పక్కా ప్రణాళిక రచించుకున్నారు. జూలై 5న గాజువాక దరి గ్లోబెక్స్ షాపింగ్ మాల్ వెనుక ఉన్న మూతపడిన చేపల కంపెనీలోకి గణేష్‌కు మాయమాటలు చెప్పి తీసుకొచ్చారు. అక్కడ వారి ప్రణాళిక ప్రకారమే.. గణేష్‌కు పూటుగా మద్యం తాగించారు. గణేష్ మత్తులోకి జారుకున్నాక గణేష్ తలపై జోగారావు కర్రతో దాడిచేశారు.

కిందపడిపోయిన గణేష్ మెడకు జోగారావు బెల్టు బిగించి చంపేశాడు. ప్రియురాలు స్వాతి.. ఎటూ కదలకుండా గణేష్ కాళ్లను అదిమి పట్టుకుంది. గణేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పక్కనే ఉన్న కాల్వలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత ఘటనాస్థలానికి తిరిగి వచ్చారు. అప్పటికీ మృతదేహం పాడవకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతదేహం పూర్తిగా కాలకపోవడం.. చేతికి ఉన్న కడియం, వాచీకి మంటలు అంటుకోలేదు. ఇదిలావుంటే.. జూలై 13న గ్లోబెక్స్ షాపింగ్ మాల్ వెనుక కాల్వలో కాలిపోయిన మృతదేహం లభించిందంటూ స్థానిక వీఆర్ఒ పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మొదట్లో మృతదేహం కాలిపోవడం వల్ల ఎవరనేది గుర్తించలేకపోయారు. మృతదేహానికి ఉన్న చేతి కడియం, వాచీలే ఈ కేసులో కీలకంగా మారాయి. వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు స్వాతి, జోగారావు అంగీకరించారు.
Published by: Narsimha Badhini
First published: July 23, 2020, 8:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading