హోమ్ /వార్తలు /క్రైమ్ /

Susheel Kumar : గ్యాంగ్‌స్టర్‌నే మించి పోయిన సుశీల్ నేరాలు.. పోలీసుల కస్టడీలో పలు విషయాలు బహిర్గతం

Susheel Kumar : గ్యాంగ్‌స్టర్‌నే మించి పోయిన సుశీల్ నేరాలు.. పోలీసుల కస్టడీలో పలు విషయాలు బహిర్గతం

స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల విచారణలో సుశీల్ నేరాల చిట్టా బయటకు వస్తున్నది. ఒక గ్యాంగ్‌స్టర్‌నే మించిపోయిన నేరాల్లో సుశీల్ భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించారు.

స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల విచారణలో సుశీల్ నేరాల చిట్టా బయటకు వస్తున్నది. ఒక గ్యాంగ్‌స్టర్‌నే మించిపోయిన నేరాల్లో సుశీల్ భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించారు.

స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల విచారణలో సుశీల్ నేరాల చిట్టా బయటకు వస్తున్నది. ఒక గ్యాంగ్‌స్టర్‌నే మించిపోయిన నేరాల్లో సుశీల్ భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించారు.

ఇంకా చదవండి ...

  యువ రెజ్లర్ సాగర్ దండక్ (Sagar Dandak) హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన సుశీల్ కుమార్ (Susheel Kumar) ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మే 4న ఢిల్లీలోని చత్రాసాల్‌లో హత్య జరుగగా.. ఆనాటి నుంచి పరారీలో ఉన్న సుశీల్ కుమార్ 18 రోజుల తర్వాత పటియాలా సమీపంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆనాటి నుంచి కోర్టు అనుమతితో కస్టడీలో ఉన్న సుశీల్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. హత్య జరిగిన స్థలం.. ఆ తర్వాత సుశీల్, అతడి కుడి భుజం అజయ్ కుమార్ కలసి తిరిగి ప్రదేశాలకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తిప్పారు. అయితే పోలీసు విచారణలోసుశీల్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తున్నది. కాగా, జాతీయ మీడియా కథనం మేరకు సుశీల్ కుమార్ తనకు రెజ్లర్‌గా (Wrestler) ఉన్న పలుకుబడితో అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిపినట్లు తెలుస్తున్నది. ఢిల్లీ పోలీసు వర్గాల కథనం మేరకు.. అసలు గొడవంతా చత్రాసాల్ సమీపంలోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఉన్న ఫ్లాట్‌కు సంబంధించి మొదలయ్యింది. సుశీల్ కుమార్‌కు చెందిన ఈ ఫ్లాట్‌లో సాగర్ దండక్‌తో పాటు అతడి స్నేహితుడు సోనూ మహల్ కూడా ఉండేవాడు. వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కాలా జథేదికి సోనూ మహల్ స్వయానా మేనల్లుడే కాకుండా అతడికి కుడి భుజంలా వ్యవహరించేవాడు. చత్రాసాల్‌ వద్ద సాగర్ మీద సుశీల్ దాడి చేసిన సమయంలో పక్కనే సోనూ కూడా ఉన్నాడు. ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించిన సోనూపై కూడా సుశీల్ దాడి చేయడంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కాలా జథేదీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. సుశీల్ కుమార్, అజయ్‌ల ఆచూకీ కనుగొనడానికి కాలా జథేదీ కూడా తీవ్రంగా శ్రమించాడు.

  ఒకప్పుడు సుశీల్, జథేది దోస్తులే..

  తన మేనల్లుడిపై దాడి చేశాడని సుశీల్ కుమార్‌పై కాలా జథేది పగపెంచుకున్నాడు. కానీ ఒకప్పుడు ఇద్దరూ మంచి దోస్తులేనని.. కలసి దందాలు కూడా చేశారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. హత్యకు కారణమైన ఫ్లాట్‌లోనే వీరిద్దరూ కలసి చాలా నేరాలకు ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ పోలీసుల రాడార్‌లో ఉన్న అనేక మంది క్రిమినల్స్‌కు సుశీల్ ఈ ఫ్లాట్‌లో షెల్డర్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. జథేదితో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఫ్లాట్‌లో అనేక క్రిమినల్ పనులకు స్కెచ్‌లు గీసే వాళ్లని తెలిసింది. సుశీల్ కుమార్ ఇల్లు కావడంతో అక్కడి చుట్టు పక్కల నివసించే వాళ్లు అందరూ రెజ్లర్లే అనుకునే వారు. ఇక కాలా జథేది ఒకడుగు ముందుకు వేసి ఢిల్లీ, యూపీ, హర్యానా జాతీయ, రాష్ట్ర హైవేలపై ఉన్న టోల్ బూత్‌లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇందుకు గాను సుశీల్ కుమార్ సహాయం కోరినట్లు తెలిసింది. సుశీల్ కుమార్‌కు తెలిసిన రాజకీయ సంబంధాలతో టోల్ గేట్ల కాంట్రాక్టు దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం.

  ఇక సుశీల్ కుమార్‌కు స్వయంగా ఒక ఎక్స్‌టార్షన్ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఒక కేబుల్ వ్యాపారిని రూ. 1 కోటి ఇవ్వాలంటూ కాలా జథేది బెదిరించాడని.. ఆ కాల్ వెనుక సుశీల్ కుమార్ హస్తం ఉన్నట్లు పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో తేల్చారు. కేబుల్ టీవీ వ్యాపారికి ఒక అంతర్జాతీయ నెంబర్ నుంచి సుశీల్ కాల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మోడల్ టౌన్‌లోని ఫ్లాట్ విషయంలో కాలా జథేదితో కూడా సుశీల్‌కు విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తున్నది.

  చదవండి : ఇంట్లో తెలియకుండా బాక్సింగ్ నేర్చుకొని.. నేడు చాంపియన్‌గా మారిన పూజా రాణి.. ఒలింపిక్స్ లక్ష్యంగా..

  ఆ తర్వాత సుశీల్ పేరు మోసిన గ్యాగ్‌స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలితో చేతులు కలిపాడు. ఈ నవీన్ బాలికి కుడి భుజంగా ప్రిన్స్ ఉండేవాడు. సాగర్ దండక్ పై దాడి చేస్తుండగా సుశీల్ కుమార్ వీడియో తీయమని చెప్పింది ఈ ప్రిన్స్ అనే వ్యక్తికే. నీరజ్ బవానా గ్యాంగ్‌కు సుశీల్ చాలా దగ్గరయ్యిన తర్వాత కాలా జథేదితో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడు. ఆ తర్వాతే ఫ్లాట్ విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. సోను మహల్, సాగర్ దండక్ ఈ విషయంలో బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటంతో వారికి తగిన బుద్ది చెప్పాలని సుశీల్ భావించాడు.

  వారిద్దరిపై సుశీల్ దాడి చేసిన రోజు చత్రాసాల్ స్టేడియం వెలుపలే గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా గ్యాంగ్ వేచి చూస్తున్నది. ఒక వేళ ఆ సమయానికి కాలా జథేదీ లేదా అతడి మనుషులు కనుక సుశీల్ మీదకు వస్తే వీళ్లు అతడికి రక్షణగా ఉండటానికే స్టేడియం బయట ఎదురు చూస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన స్థలంలో సీజ్ చేసిన మహీంద్ర స్కార్పియో వాహనం నీరజ్ బవానా గ్యాంగ్‌కు చెందిన మోహిత్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం.

  అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తెచ్చిన సుశీల్ కుమార్ పైకి చాలా సౌమ్యంగా ఉంటాడని.. కనీసం నాన్ వెజ్ కూడా తినడని సన్నిహితులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం అతడి కౄర మనస్థత్వం గురించి ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటున్నారు.

  First published:

  Tags: Delhi police, Murder, Susheel kumar, Wrestling

  ఉత్తమ కథలు