నేను దళిత యువతిని కాకపోయివుంటే, నన్ను రేప్ చేసేవాళ్లు కాదు : అళ్వార్ బాధితురాలు

Alwar, Rajasthan : పోలీసులు కేసు నమోదు చేశాక, రేపిస్టులు తాము తీసిన రేప్ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేశారు. కొన్ని గంటల్లోనే అది వైరల్ అయ్యింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 1:22 PM IST
నేను దళిత యువతిని కాకపోయివుంటే, నన్ను రేప్ చేసేవాళ్లు కాదు : అళ్వార్ బాధితురాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏప్రిల్ 26న రాజస్థాన్‌లోని అళ్వార్‌లో 19 ఏళ్ల మనీషా (పేరు మార్చాం)ను ఐదుగురు దుండగులు హైవే పక్కకు లాక్కుపోయి గ్యాంగ్ రేప్ చేశారు. తాను దళిత యువతిని కావడం వల్లే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. వాళ్లు నా పేరు, నా భర్త పేరూ అడిగారు... కులాలు కూడా అడిగారు. మా ఇంటి పేరు బలాయ్ అని తెలిశాక... (ఎస్సీ అని తెలిసి) నాపై దాడికి దిగారు అని బాధితురాలు తెలిపింది. తాను వారి కులం అమ్మాయిగానీ, లేదా అగ్ర కులానికి చెందిన అమ్మాయి అయివుంటే తనపై దాడి చేసేవారు కాదని మనీషా ఆవేదన వ్యక్తం చేసింది. దళిత యువతిపై దాడి చేసినా, ఎవరూ శిక్షించరన్న ఉద్దేశంతోనే తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆమె అభిప్రాయపడింది.

మనీషా, ఆమె భర్త కలిసి... షాపింగ్ కోసం తమ గ్రామం నుంచీ బైకుపై బయల్దేరారు. వెనకాలే రెండు బైకులపై వచ్చిన ఐదుగురు... వాళ్లను అడ్డుకున్నారు. ఆ జంట బైకును రోడ్డు పక్కన పార్క్ చేసి... ఇద్దర్నీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇద్దర్నీ చితకబాదారు. ఆతన్ని చెట్టుకు కట్టేసి... ఆమెను గ్యాంగ్ రేప్ చేసి, వీడియో తీశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు.

రేపిస్టులంతా గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన వాళ్లుగా తెలిసింది. స్థానికంగా ఆ కులానికి ఆధిపత్యం ఉంది. పోలీసులు ఆ ఐదుగురినీ అరెస్టు చేశారు. బాధితులు స్థానికంగా నేత కార్మిక వర్గాలకు చెందినవారు. రాజస్థాన్‌లో ఆ కులం వారు సమాజికంగా చాలా వెనకబడి ఉన్నారు.

ఈ కేసుపై FIR నమోదు చెయ్యడానికి పోలీసులు ఆలస్యం చెయ్యడంతో... ఇది రాజకీయ కలకలం రేపింది. ఈ కేసుపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఏప్రిల్ 30న FIR నమోదు చేశారు. రేపిస్టులు తాము తీసిన వీడియోను మే 4న వాట్సాప్‌లో షేర్ చేశారు. కొన్ని గంటల్లోనే అది వైరల్ అయ్యింది. దానర్థం ఏంటి... తమకు శిక్ష పడదన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తోనే... కేసు నమోదైన తర్వాత కూడా వాళ్లు వీడియో రిలీజ్ చేశారంటోంది బాధితురాలు.

కేటుగాళ్లకు కఠిన శిక్ష పడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అఫ్‌కోర్స్ ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు కూడా ఇలాగే డిమాండ్లు వినిపించాయి. కానీ మన న్యాయవ్యవస్థ ఇప్పటికీ దోషులకు శిక్ష విధించలేకపోతోంది. మరి ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేదెప్పుడు... కేటుగాళ్లకు శిక్ష పడేదెన్నడు?

 

ఇవి కూడా చదవండి :మహిళను చంపి... ఆమె కడుపులో పిల్లాణ్ని మాయం చేశారు... ఎందుకంటే...

పవన్ కళ్యాణ్‌ తుస్సు మనిపించాడు... తమ్మారెడ్డి భరద్వాజ అలా ఎందుకన్నారంటే...

500 మందికి పైగా ఎయిడ్స్ అంటించాడు... పాకిస్థాన్‌లో ఓ డాక్టర్ నిర్వాకం...

కూతుర్ని పదేళ్లు రేప్ చేసిన తండ్రి... భార్యతో ఏమన్నాడంటే...

 
First published: May 17, 2019, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading