లేడీస్ హాస్టల్ గదిలో రహస్య కెమెరాలు...వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్...

హాస్టల్ లో నివాసం ఉంటున్న షహీన్ తన గదిలో దుస్తులు మార్చుకుంటూ తదేకంగా గదిలోని ఫ్యాన్ వంక చూసింది. సీలింగ్ వైపు ఒక కెమెరా లెన్స్ ఉందేమో అనే అనుమానం కలిగింది.

news18-telugu
Updated: March 26, 2020, 3:32 PM IST
లేడీస్ హాస్టల్ గదిలో రహస్య కెమెరాలు...వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆ హాస్టల్ లో అంతా అమ్మాయిలే వారిలో కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులే ఎక్కువ అలాంటి హాస్టల్ గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి వారు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు ఇంటర్నెట్ లో లీక్ చేసిన ఘటన బంగ్లాదేశ్ లో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే ఢాకాలోని ఓ లేడీస్ హాస్టల్ లో యువతులు నివాసముంటున్నారు. వీరంతా రకరకాల జాబ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో హాస్టల్ లో నివాసం ఉంటున్న షహీన్ (పేరు మార్పు) తన గదిలో దుస్తులు మార్చుకుంటూ తదేకంగా గదిలోని ఫ్యాన్ వంక చూసింది. సీలింగ్ వైపు ఒక కెమెరా లెన్స్ ఉందేమో అనే అనుమానం కలిగింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలు రూమ్మేట్ ఫాతిమాకు చూపించింది. కాగా అదంతా భ్రమ అని తోసిపుచ్చింది. కానీ గతవారం షహీన్ బాయ్ ఫ్రెండ్ తనకు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ వీడియోలు వచ్చాయని అందులో కొందరు హాస్టల్ అమ్మాయిలు, దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు కనిపించాయని వాటిలో షహీన్ కూడా ఉన్నట్లు ఆమెకు చూపించాడు. దీంతో షాక్ తిన్న షహీన్ వెంటనే తన స్నేహితులు అందరికీ తెలిపింది. సీలింగ్ వైపు గోడకు ఒక సీక్రెట్ కెమెరా ఉన్నట్లు నిర్ధారించుకుంది. అంతేకాదు గదిలో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నట్లు గుర్తించింది. అలాగే మిగితా గదుల్లో సైతం అలాంటి ఏర్పాటే ఉందని గుర్తించారు. దీంతో హాస్టల్ నిర్వాహకులను నిలదీయగా, దీంతో తమకు సంబంధం లేదని తెలిపింది. అయితే హాస్టల్ నిర్వాహకుల్లో ఒకరు స్థానిక ఎలక్ట్రీషియన్ తో కలిసి ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం దాదాపు 2000 వరకూ వీడియోలతో కూడిన హార్డ్ డిస్క్ తోపాటు, కెమెరాలు, చిప్పులను కూడా జప్తు చేసుకున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు