గత జన్మలో నీ భర్తను అంటూ వేధింపులు.. నకిలీ జ్యోతిష్యుడికి దేహశుద్ది..

ప్రతీకాత్మక చిత్రం

గత జన్మలో నేను నీ భర్తను అంటూ ఆమెను నమ్మించేందుకు ప్రయత్నించాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు.

  • Share this:
    బెంగళూరులో ఓ నకిలీ జ్యోతిష్యుడి భరతం పట్టారు స్థానిక మహిళ సంఘాలు. జ్యోతిష్యుడిగా ఓ మహిళతో పరిచయం పెంచుకుని ఆమెను వేధిస్తున్నందుకు చితకబాదారు. బుధవారం(అగస్టు 21)న ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. వెంకట్ కృష్ణాచార్య(28) అనే ఓ జ్యోతిష్యుడు స్థానిక శ్రీనివాస్ నగర్‌లో ఉంటున్నాడు. ఇటీవల ఓ ఇంట్లో పూజ చేయడానికి వెళ్లిన వెంకట్.. ఆ ఇంటి మహిళ బ్రైన్ వాష్ చేయడానికి ప్రయత్నించాడు. గత జన్మలో నేను నీ భర్తను అంటూ ఆమెను నమ్మించేందుకు ప్రయత్నించాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. కొద్దిరోజులుగా ఆ మహిళను ఇలాగే వేధిస్తూ వస్తున్నాడు.ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి.. ఆమె పేరు మీద బ్యాంకు లోన్ కూడా తీసుకున్నట్టు సమాచారం. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక మహిళ సంఘాలను ఆశ్రయించడంతో.. నిందితుడికి వారు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
    Published by:Srinivas Mittapalli
    First published: