Nirmal: ఏం పాపం చేసిందని ఆ చిన్నారి ప్రాణాలు తీశావు తల్లి.. నువ్వు అలా చేసినందుకు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ తన మూడేళ్ల కూతురితో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. తొలుత కూతురికి విషం తాగించి.. ఆ తర్వాత తాను కూడా తాగేసింది.

  • Share this:
    ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలకు సంబంధాలు పెరుగుతున్నాయి. అయితే చాలా వరకు వివాహేతర సంబంధాలు తీవ్ర విషాదాలనే మిగులుస్తున్నాయి. కాపురాలు కూల్చి.. జీవితాలను తలకిందుకు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నప్పటికీ.. కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన ఓ మహిళ.. మూడు రోజులకే ప్రియుడు తనను మోసం చేశాడని తెలుసుకుంది. ఈ క్రమంలోనే ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన మూడేళ్ల కూతురితో కలిసి ఆత్మహత్యకు యత్నించింది(Suicide Attempt). తొలుత కూతురికి విషం తాగించి.. ఆ తర్వాత తాను కూడా తాగేసింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

    వివరాలు.. నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలంలో ని ఓ గ్రామానికి చెందిన భర్తను కాదని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ప్రియుడి మోజులో ఆమె కొత్త లోకాన్ని ఊహించుకుంది. ప్రియుడు చెప్పిన మాయ మాటలకు మురిసిపోయింది. ఈ క్రమంలోనే భర్తను వదిలేసి.. ప్రియుడితో(Lover) కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే శ్రీకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని తెలుసుకున్న ఆమె.. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య యత్నం చేసింది. తనతో పాటు కూతురికి కూడా విషం తాగించింది.

    వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి.. కుక్క పిల్లతో ఆడుకుంటున్న బాలిక.. అయ్యో పాపం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..

     అయితే పాపం తల్లి ఇచ్చిన విషం తాగిన అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జికి చేరుకున్నారు. ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మహిళ ప్రియుడితో కలిసి వెళ్లిపోవడంతో.. ఆమె భర్త తీవ్ర అవమాన భారానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఊరు విడిచి వెళ్లిపోయినట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.




    కర్ణాటకలో మరో నిర్భయ..
    కర్ణాటకలోని మైసూరులో నిర్భయ తరహాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన ఓ యువతిని.. ఫాలో చేసిన కొందరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం బస్వరాజ్ బొమ్మై.. నిందితులను త్వరగా పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. మరోవైపు ప్రత్యేక బృందం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతుందని.. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని కర్ణాటక హోం మంత్రి తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: