Home /News /crime /

Very Sad: చూడటానికి ఎంత బాగుందో చూడండి.. ఆ పని ఎలా చేయాలని అనిపించిందో అతడికి..

Very Sad: చూడటానికి ఎంత బాగుందో చూడండి.. ఆ పని ఎలా చేయాలని అనిపించిందో అతడికి..

చైత్ర (ఫైల్)

చైత్ర (ఫైల్)

Very Sad: అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అయిన భార్యాభర్తల బంధంలో నేటి రోజుల్లో అదే అన్యోన్యత కరువవుతుంది . ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. దారుణంగా వ్యవహరిస్తూ సొంత కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు ఎంతోమంది.

    అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అయిన భార్యాభర్తల బంధంలో నేటి రోజుల్లో అదే అన్యోన్యత కరువవుతుంది . ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. దారుణంగా వ్యవహరిస్తూ సొంత కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు ఎంతోమంది. దీంతో భార్యాభర్తల బంధం మనస్పర్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంతేకాదు ఇక భార్య భర్తల బంధం లో తలెత్తిన చిన్నపాటి గొడవలు కారణంగా ఎంతోమంది మనస్థాపం చెంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజుల్లో మూడు ముళ్ళతో ఒకటైన భార్యాభర్తల బంధం మూన్నాళ్ళ ముచ్చట అన్న విధంగానే మారిపోతుంది.

    Lovers In RTC Bus: అతడికి 28 ఏళ్లు.. బాలికకు 14 ఏళ్లు.. ఆటోలో ప్రేమించుకున్నారు.. బస్సులో ఇలా చేశారు..


    చిన్న చిన్న గొడవలు అనేవి దంపతుల మధ్య సర్వసాధారణం. కానీ చిన్నపాటి గొడవలనే ఎంతోమంది భూతద్దం పెట్టి చూస్తూ ఏకంగా భార్యాభర్తల బంధాన్ని విడిపోయే వరకు తెచ్చుకుంటున్నారు. ఇక మరి కొంతమంది చిన్న విషయాలకే మనస్థాపం చెందుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొన్ని ఘటనల్లో పెళ్లి సమయంలో కట్నం తీసుకొని.. ఇంకా కట్నం కావాలని వేధించే భర్తలు కూడా ఉన్నారు. ఇలా ప్రతీ రోజూ తన భర్త వేధిస్తుండగా.. ఓ భార్య మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్టాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

    Affair: పుట్టింటికి వెళ్లిన భార్య.. వెంటనే వస్తానని చెప్పి తిరిగి రాలేదు..; ముగ్గురు ప్రియులతో కలిసి..


    కర్టాటక కోలారు తాలూకాలోని కల్వమంజలి గ్రామంలో 25 ఏళ్ల చైత్ర మరియు తన భర్త వెంటేష్ కలిసి ఉంటున్నారు. ఆమె ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉంటుంది. అతడు మాత్రం నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. పెళ్లి జరిగి దాదాపు సంవత్సరం అయింది. మొదటి మూడు నెలలు ఇద్దరు బాగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఆమె ఆరు నెలల క్రితం ఆత్మహత్యాయాత్నానికి కూడా పాల్పడినట్లు తెలిసింది. రాను రాను ఆమెపై అదనపు కట్నం తేవాలాని వెంకటేష్ అతడి తల్లిదండ్రలు ఆమెను వేధించినట్లు తెలిసింది. ఇటీవల ఆమె వాళ్ల వేధింపులకు తట్టుకోలేక  ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

    OMG: ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు.. ఓ ఘటనకు బాధ్యుడిగా మారాడు.. దీంతో తన కాలేజీకి వెళ్లి ఇలా చేశాడు..


    మృతురాలి కుటుంబసభ్యులు మాత్రం.. ఆమె చావుకు కారణం భర్త అతడి తల్లి అంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఇంట్లో ఒక్కరు కూడా లేకుండా పరారయ్యారు. దీంతో ఆ అనుమానాలను బలపరిచినట్లు అయింది. మృతురాలి అక్క శ్వేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిఐ శివరాజ్‌ దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. చిన్న చిన్న విషయాలకు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని.. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు ఉన్నారని.. దయచేసి ఇలాంటి పనులకు పాల్పడవద్దు అంటూ పోలీసులు సూచించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Karnataka, Kolar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు