హోమ్ /వార్తలు /క్రైమ్ /

అన్నీ అయిపోయాయ్.. ఆ పని చేయడం లేదని బాయ్ ఫ్రెండ్ ను కోర్టుకీడ్చిన యువతి

అన్నీ అయిపోయాయ్.. ఆ పని చేయడం లేదని బాయ్ ఫ్రెండ్ ను కోర్టుకీడ్చిన యువతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వారి ఎనిమిదేళ్ల డేటింగ్ కు ప్రతిరూపంగా ఒక సంతానం కూడా ఉంది. ఇక దీనికి పుల్స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలు ఎక్కాలని నిశ్చయించుకుంది ఆ యువతి. పెళ్లి చేసుకుందామని అతడిని అడిగింది. కానీ అతడు మాత్రం ఆ యువతికి ఊహించని షాకిచ్చాడు.

  • News18
  • Last Updated :

వాళ్లిద్దరూ ఎనిమిదేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. చెట్టు పుట్టా తిరిగారు. ప్రకృతితో పాటు ప్రయాణించారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వీళ్లిద్దరి విషయం ఇంట్లో అందరికీ తెలుసు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే దాకా ఆమె అతనికి.. అతను ఆమెకు మెసేజ్ లే మెసేజ్ లు. ఆఫీసులో ఉన్నా.. కొలిగ్స్ తో ఉన్నా.. వారి ధ్యాస వారిదే. వారి ఎనిమిదేళ్ల డేటింగ్ కు ప్రతిరూపంగా ఒక సంతానం కూడా ఉంది. ఇక దీనికి పుల్స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలు ఎక్కాలని నిశ్చయించుకుంది ఆ యువతి. పెళ్లి చేసుకుందామని అతడిని అడిగింది. కానీ అతడు మాత్రం ఆ యువతికి ఊహించని షాకిచ్చాడు. పెళ్లి చేసుకోవడం కుదరదన్నాడు. ఎందుకు కుదరదో తేల్చుకుందామని ఆ యువతి కోర్టు మెట్లెక్కింది.

అసలు వివరాల్లోకెళ్తే... గెట్రూడె గోమా అనే యువతిది జాంబియా. ఆమె ఎనిమిదేళ్లుగా హర్బర్ట్ సలైకీతో డేటింగ్ లో ఉంది. అతడు భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. దీంతో ఆమె సర్వస్వం అప్పగించింది. వారి ఎనిమిదేళ్ల డేటింగ్ కు చిహ్నంగా ఒక సంతానం కూడా ఉంది. అయితే పెళ్లి గురించి అడిగినప్పుడల్లా సలైకీ మాత్రం ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడు. ఒక నిర్ధిష్టమైన టైం చెప్పేవాడు కాదు. కానీ తనకు అవసరమున్నప్పుడు మాత్రం ఆమె దగ్గరికి వచ్చి.. అవసరం తీర్చుకుని వెళ్లేవాడు.

ఇక లాభం లేదని ఆమె తెగించి అడిగింది. నూవ్ నన్ను పెళ్లి చేసుకుంటావా..? లేదా..? అని నిలదీసింది. దీంతో సలైకీ అసలు విషయం చెప్పాడు. తనకు కట్నం కావాలని అడిగాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. ఇదంతా నూవ్ డేటింగ్ లో ఉన్నప్పుడు చెప్పలేదని అడిగితే.. అప్పడా అవసరం రాలేదని చెప్పాడు సలైకీ. ఆ పై ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు.

ఇదంతా విన్న ఆ యువతి.. కోర్టును ఆశ్రయించింది. డేటింగ్ పేరుతో తనను మోసం చేశాడని.. ఒక సంతానం కూడా కలిగిన తర్వాత.. కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని అర్థించింది. దీనిపై విచారణ కొనసాగుతుంది.

First published:

Tags: Crime, Crime news, Dating, Love affair, VIRAL NEWS

ఉత్తమ కథలు