గంటల వ్యవధిలో కోట్లు దొంగిలించే వాళ్లను చూశాం. కళ్లు మూసి తెరిచే లోపు లక్షలు మాయం చేసే వాళ్ల గురించి విన్నాం. రోడ్లపై, శుభకార్యాల్లో బంగారు నగలు(Gold jewelry), డైమండ్ జువెలరీ(Diamond Jewelery)లు ఇట్టే లాక్కుపోయే వాళ్లు ఉన్నారు. కాని బిహార్(Bihar)లో ఇద్దరు ఖతర్నాక్ మహిళలు దొంగలు(Women thieves)గా మారారు. చూడటానికి చాలా ధనవంతులుగా బిల్డప్ ఇస్తూనే దొంగతనాలు చేయడానికి రెడీ అయ్యారు.
బ్రెడ్ ప్యాకెట్ చోరీ చేసిన ఖిలేడీలు..
దేశంలో దొంగతనాల వీడియోలు, రాబరీ వీడియోస్ చూశాం కాని..బీహార్‌లో జరిగిన ఓ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో స్పెషాలిటీ ఏమిటంటే ఇద్దరు మహిళలు దొంగల అవతారమెత్తారు. ముంగేర్ పట్టణంలోని ఓ కిరాణ దుణానికి వచ్చారు. షాపు యజమాని వేరే కస్టమర్లకు సామాన్లు ఇచ్చే బిజీగా ఉండటం గమనించారు. ఇద్దరు మహిళల్లో షాపు ఓనర్‌ని ఏదో కావాలన్నట్లుగా మాటల్లో పెట్టారు. మరొకరు కిరాణషాపు కౌంటర్‌పై పెట్టిన బ్రెడ్ ప్యాకెట్‌ని ఓనర్‌కి తెలియకుండా దొంగతనం చేసి దాచిపెట్టుకున్నారు. చాలా డబ్బున్న వాళ్లలా తయారై వచ్చిన ఇద్దరు మహిళలు కిరాణా దుకాణంలో పాతిక రూపాయలు విలువ చేసే బ్రెడ్ ప్యాకెట్‌ని దొంగిలించడం యజమాని గమనించలేదు. అయితే షాపులో అమర్చిన సీసీ కెమెరాలో మాత్రం ఖతర్నాక్ లేడీస్ చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
మాయదారి లేడిస్..
కిరాణషాపుకు కస్టమర్లుగా సంచులు పట్టుకొని వచ్చిన మహిళలు కౌంటర్ టేబుల్‌పై పెట్టిన బ్రెడ్ ప్యాకెట్లతో పాటు మిక్స్చర్ ప్యాకెట్లు, మరికొన్ని సామాన్లకు సంబంధించిన ప్యాకెట్లు వాళ్లు తెచ్చుకున్న సంచిలో వేసుకొని మెల్లిగా జారుకున్నారు. షాపు ఓనర్ పిట్టూ చౌదరి లేడీ ఖిలాడీలు వెళ్లిపోయిన తర్వాత చూసుకొని షాపులో పని చేసేవాళ్లను ఏం కొనుగోలు చేశారని అడగడంతో ఏం కొనుగోలు చేయలేదని చెప్పారు. దాంతో అతనికి అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో వాళ్లు యజమానిని ఏమర్చి ఎత్తుకెళ్లిన సామాన్లు లిస్ట్ బయటపడింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించడంతో వాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు షాపు యజమాని, పోలీసులు.
కక్కూర్తి దొంగలు..
ఆడవాళ్లు దొంగతనాలు చేశారంటే ఖచ్చితంగా నగలో, డబ్బో ఎత్తుకెళ్లారని అనుకుంటారు అందరు. కాని వెరైటీగా పాతిక రూపాయలు విలువ చేసే బ్రెడ్ ప్యాకెట్‌ని దొంగిలించడానికి ఇంత అమాయకంగా వచ్చారెంట్రా బాబు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు ఖతర్నాక్ దొంగలు కాదు కక్కూర్తి దొంగలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Viral Video