బార్‌లోకి దొంగతనంగా చొరబడి ఓ మహిళ రాత్రంతా ఏం చేసిందో తెలుసా..?

బార్ క్లోజ్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ మహిళ ఎవరు లేరని గుర్తించి హాయిగా చేతికందని మందు తాగడం మొదలు పెట్టింది. రాత్రంతా ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ అనే తేడా లేకుండా మందు కొడుతూ ఎంజాయ్ చేసింది. రాత్రంతా నానా హంగామా చేసింది.

news18-telugu
Updated: August 23, 2019, 5:05 PM IST
బార్‌లోకి దొంగతనంగా చొరబడి ఓ మహిళ రాత్రంతా ఏం చేసిందో తెలుసా..?
నమూనా చిత్రం
  • Share this:
బార్ క్లోజింగ్ టైమ్ పూర్తియినప్పటికీ అందులోనే ఓ మూలన నక్కి...అంతా వెళ్లిపోయాక రాత్రంతా పీకలదాకా తాగుతూ ఓ మహిళ ఎంజాయ్ చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కెంటుకీ ప్రాంతంలోని జార్జ్ టౌన్ లో డొన్న మార్టిన్ అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ బార్లో రహస్యంగా చొరబడింది. బార్ క్లోజ్ అయినప్పటికీ అందులోనే ఓ మూలన నక్కి దాక్కుంది. సిబ్బంది క్లీనింగ్ పూర్తి అయిన తర్వాత అంతా ఇళ్లకు కదిలారు. బార్ క్లోజ్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ మహిళ ఎవరు లేరని గుర్తించి హాయిగా చేతికందని మందు తాగడం మొదలు పెట్టింది. రాత్రంతా ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ అనే తేడా లేకుండా మందు కొడుతూ ఎంజాయ్ చేసింది. రాత్రంతా నానా హంగామా చేసింది. తనకు నచ్చిన డీజే ప్లే చేసుకుంటూ, చిందులు వేస్తూ బార్ మొత్తం ఓ ప్లే గ్రౌండ్ లా మార్చేసి ఆడేసుకుంది.

ఇక చివరకు బాగా అలసిపోెయిన తర్వాత తెల్లవారుజాము వరకూ మందు కొట్టి చివరకు టేబుల్ మీదనే మత్తులో జారుకుంది. అయితే ఉదయం బార్ ఓపెన్ చేసిన సిబ్బంది మహిళ బార్లోనే ఉన్న దృశ్యం చూసి ఖంగు తిన్నారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు