Home /News /crime /

WOMEN SENDS CONDOMS TO BOMBAY HIGH COURT JUDGE PUSPA GANEDIWALA IN PROTEST AGAINST CONTROVERSIAL POCSO RULINGS SRD

Condoms : హైకోర్టు జడ్జికే కండోమ్ లు పంపిన మహిళ... కారణమేంటంటే...

ప్రతీకాత్మ కచిత్రం

ప్రతీకాత్మ కచిత్రం

Condoms : జనరల్‌గా అందరూ ఏమనుకుంటారో... అందుకు భిన్నమైన తీర్పులు కోర్టుల నుంచి వస్తుంటాయి. ఆ తర్వాత అవి చర్చకు దారితీస్తాయి. "పోక్సో" (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్‌ పుష్ప గనేడివాలా.

ఇంకా చదవండి ...
    జనరల్‌గా అందరూ ఏమనుకుంటారో... అందుకు భిన్నమైన తీర్పులు కోర్టుల నుంచి వస్తుంటాయి. ఆ తర్వాత అవి చర్చకు దారితీస్తాయి. "పోక్సో" (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జస్టిస్‌ పుష్ప గనేడివాలా. శరీరాన్ని శరీరం తాకలేదు గనుక నేరంగా పరిగణించలేమనడం సహా.. ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి పట్టుకుని, ప్యాంటు జిప్‌ తెరచినా ఈ చట్టం కింద అదేమీ నేరం కాదని ఆమె ఇచ్చిన తీర్పుపై భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ పోక్సో చట్టం నుంచి నిందితులకు విముక్తి కలిగించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఇక ,వివాదాస్పద తీర్పులు వెల్లడించిన బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్ జడ్జి జస్టిస్‌ పుష్ప గనేడివాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద తీర్పులు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. కేంద్రం ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళ పుష్ప గనేడివాలా తీర్పులను వ్యతిరేకిస్తూ.. నిరసనగా జడ్జికి కండోమ్‌లు పంపింది. అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్‌ గనేడివాలా పని చేస్తోన్న బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ రిజిస్ట్రీతో పాటు ముంబైలోని మరో 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్‌లు పంపినట్లు వెల్లడించింది.

    ఈ సందర్భంగా దేవ్‌శ్రీ త్రివేది మాట్లాడుతూ.. "అన్యాయాన్ని నేను సహించలేను. గనేడివాలా తీర్పు వల్ల ఓ మైనర్‌ బాలికకు న్యాయం జరగలేదు. ఆమెని సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాను. ఆమె తీర్పు పట్ల నా నిరసన తెలియజేయడం కోసం ఇలా కండోమ్‌ ప్యాకెట్లు పంపాను. మొదట ఈ నెల 9న కొన్ని ప్యాకెట్లు పంపాను. అవి చేరుకున్నట్లు రిపోర్ట్‌ అందింది. ఆ తర్వాత మరో 12 చోట్లకు కండోమ్‌ ప్యాకెట్లు పంపాను" అని తెలిపింది.

    "ఓ మహిళగా నేను చేసిన పని తప్పని భావించడం లేదు. దీని గురించి నాకు ఎలాంటి చింత లేదు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలి. ఇక జస్టిస్‌ గనేడివాలా లాంటి వారి వాల్ల మగాళ్లు మరింత రెచ్చిపోతారు. ఆడవారిపై అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. అప్పుడు అత్యాచారాలు స్త్రీల దుస్తుల మీదుగానే జరుగుతాయి" అంటూ దేవ్‌శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Condoms, High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు