మహిళలు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాలలో తరచుగా నిరసనలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో మద్యం దుకాణాలపై దాడులు కూడా చేస్తుంటారు. రాళ్లు రువ్వుతుంటారు. వైన్ షాపు ముందు కూర్చోని నిరసనలు కూడా తెలియజేస్తు ఉంటారు. ఇలాంటి సందర్బలలో తోపులాటలు, పరస్పర దాడులు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. అర్ధరాత్రి మహిళలు నడిరోడ్డుమీద రచ్చచేశారు. మద్యం దుకాణానికి వెళ్లి నానా బీభత్సం చేశారు. గురువారం అర్దరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఢిల్లీలోని (Delhi) ఒక వైన్‌షాప్ (Wine shop) బయట రెండు వర్గాల మహిళల (Woman Protesters) మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. మద్యం షాపుకు ఎదురుగా ఉన్న భవనం నుండి చిత్రీకరించిన వీడియోలో మహిళా బౌన్సర్లు, నలుపు రంగులో, మహిళా నిరసనకారులను తన్నడం, కొట్టడం కనిపించింది. అదే విధంగా అక్కడ అరుపులు, కేకలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో ఓ పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో మద్యం షాపు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు కొందరు నిరసనకు దిగడంతో గొడవ మొదలైంది.
तस्वीरें हैरान करने वाली है।शराब के ठेके का विरोध कर रही महिलाओ ओर शराब के ठेके पर तैनात महिला बाउंसरो के बीच जमकर मारपिटाई हुई। सवाल ये की काले कपड़ो में शराब की दुकानों पर इतने बाउंसरो की तैनाती आख़िर क्यो। #Delhi pic.twitter.com/Ut0HSpkZ7d
— Sushant Mehra (@SushantMehraAT) June 25, 2022
దీంతో స్థానిక మహిళలు అక్కడికి వచ్చి మూసేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్ లు, మహిళలపై దాడులు (Woman bouncers) చేశారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో.. కొంత మంది స్థానిక పోలీసులు దీన్ని అడ్డుకొవడానికి ప్రయత్నించారు. దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతడిపై కూడా మహిళలు దాడిచేశారు. అతని యూనిఫాం చిరిగిపోయింది. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ కేసులో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. క్షతగాత్రులను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Fighting, Viral Video, Wine shops