హోమ్ /వార్తలు /క్రైమ్ /

జువెలరీ షాప్‌లో పనిచేసే ఇతను ముప్పై ఏళ్ల వయసొచ్చిందని పెళ్లి చేసుకున్నాడు.. కానీ చేసిన తప్పేంటంటే..

జువెలరీ షాప్‌లో పనిచేసే ఇతను ముప్పై ఏళ్ల వయసొచ్చిందని పెళ్లి చేసుకున్నాడు.. కానీ చేసిన తప్పేంటంటే..

అరుల్‌ప్రకాష్ (ఫైల్ ఫొటో)

అరుల్‌ప్రకాష్ (ఫైల్ ఫొటో)

అతని వయసు 30 ఏళ్లు. ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు. ఇద్దరి మధ్య 14 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అయినా సరే ఆ వ్యక్తి పట్టించుకోలేదు. స్కూల్‌కు వెళ్లి చదువుకునే అమ్మాయి అని తెలిసి కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతనిని అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...

  సాలెం: అతని వయసు 30 ఏళ్లు. ఆ బాలిక వయసు 16 సంవత్సరాలు. ఇద్దరి మధ్య 14 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అయినా సరే ఆ వ్యక్తి పట్టించుకోలేదు. స్కూల్‌కు వెళ్లి చదువుకునే అమ్మాయి అని తెలిసి కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతనిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని సాలెం జిల్లాలో స్కూల్‌కు వెళ్లే 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సాలెం జిల్లా అత్తూరు సమీపంలోని సతశివపురానికి చెందిన ధర్మలింగం అరుల్‌ప్రకాష్(30) టెన్త్ వరకూ చదివి ఆ తర్వాత మానేశాడు. అప్పటి నుంచి ఓ ప్రైవేట్ జువెలరీ షాప్‌లో పనిచేస్తున్నాడు. జూన్ 23న ఆ యువకుడు 16 ఏళ్ల వయసున్న బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఇలా పెళ్లి చేసుకున్నాడని రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందడంతో.. అత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ ఈ ఘటనపై విచారణ జరిపారు. ఈ విచారణలో అరుల్‌ప్రకాష్ 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆ బాలికను సాలెం బాలికల వసతి గృహానికి పంపించారు. అదే సమయంలో.. అరుల్‌ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు.

  ఇరు కుటుంబాలపై కేసు నమోదు చేశారు. మన దేశంలో అమ్మాయిలకు 18 ఏళ్ల లోపు పెళ్లి చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కొందరు తల్లిదండ్రుల తీరు మారడం లేదు. తక్కువ వయసులో వివాహం చేసి ఆ తర్వాత కన్న కూతుర్ల క్షోభకు కారణమవుతున్నారు. ఇదిలా ఉండగా.. అబ్బాయిలు 21 ఏళ్లు నిండాకే వివాహం చేసుకోవాలని చెబుతున్న చట్టాలు.. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితే పెళ్లి చేయవచ్చని నిర్దేశించడాన్ని కొన్ని మహిళా సంఘాలు తప్పుబడుతున్నాయి. పెళ్లి విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల కనీస వయసు ఒకేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.

  ఇది కూడా చదవండి: Shocking: ఏదో అనుకుని ఏదేదో చేస్తారు.. బంగారం లాంటి జీవితాలు.. ఇప్పుడేమైంది ఇద్దరి పరిస్థితి..

  ఇదిలా ఉంటే.. అమ్మాయికి పెళ్లి చేసే విషయంలో కనీస వయసును 18 ఏళ్ల కంటే పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే.. ఇప్పటికీ దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతుండటం గమనార్హం. ముప్పై ఏళ్లు నిండిన అబ్బాయికి, 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే ఆలోచనలకు అడ్డు కట్ట పడటం లేదు. ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలని.. సమాజం ఒత్తిళ్లకు, సూటిపోటి మాటలకు తలొగ్గి అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్న ధోరణి మారాలన్నది మేధావుల మాట.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: After marriage, Child marriages, Crime news, Marriage, Tamilnadu

  ఉత్తమ కథలు