జల్లికట్టులో జనాలపై దూసుకెళ్లిన ఎద్దులు.. మహిళ మృతి

ఎద్దులు జనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించాయి. పోటీలు చూసేందుకు వచ్చిన మహాలక్ష్మీ అనే మహిళ ఎద్దుల దాడిలో చనిపోయింది.

news18-telugu
Updated: January 16, 2020, 2:49 PM IST
జల్లికట్టులో జనాలపై దూసుకెళ్లిన ఎద్దులు.. మహిళ మృతి
ఎద్దులు జనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించాయి. పోటీలు చూసేందుకు వచ్చిన మహాలక్ష్మీ అనే మహిళ ఎద్దుల దాడిలో చనిపోయింది.
  • Share this:
పొంగల్ పండగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. పోట్లగిత్తలను నిలువరించేందుకు యువత పోటీపడుతున్నారు. ఐతే పలుచోట్ల ఎద్దులతో తలపడే గ్రామంలో యువకులకు గాయాలవుతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి సురయార్‌లో జరిగిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఎద్దులు జనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించాయి. పోటీలు చూసేందుకు వచ్చిన మహాలక్ష్మీ అనే మహిళ ఎద్దుల దాడిలో చనిపోయింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

తమిళనాడులో ప్రతి ఏటా జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ క్రీడ తమ సంప్రదాయంలో భాగమని కోర్టులు నిషేధం విధించినా.. పోలీసులు ఆంక్షలు పెట్టినా.. ఆపే ప్రసక్తే లేదని తమిళులు చెబుతున్నారు. అందుకే సంక్రాంతి పండగ రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టును వైభంగా నిర్వహిస్తున్నారు. ఎద్దుల దాడిలో జనాలు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో.. జల్లికట్టు ప్రాంగణం వద్ద డాక్టర్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుతున్నారు. ఐతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ప్రాణాలు పోతున్నాయి.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>