ఆరు నెలలుగా అమ్మ మృతదేహంతోనే జీవనం.. ఆ కూతురు ఎందుకిలా చేసింది..?

ఆమె తల్లి చనిపోయి ఆరు నెలలైంది. మృతదేహం కుల్లిపోయినా.. దానిని దహనం చేయలేదు. చెబుదామన్నా ఆమె దగ్గరికీ ఎవరూ రారు. వచ్చినా ఆమె మాట వినరు. ఆమె గతం అలాంటిది. దీంతో ఆమె తల్లి శవంతోనే సావాసం చేసింది. ఎందుకిలా చేసింది..?

news18
Updated: November 23, 2020, 4:23 PM IST
ఆరు నెలలుగా అమ్మ మృతదేహంతోనే జీవనం.. ఆ కూతురు ఎందుకిలా చేసింది..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 23, 2020, 4:23 PM IST
  • Share this:
ఆమె తల్లి చనిపోయింది. ఆరు నెలలైంది. కానీ ఆ మృతదేహాన్ని ఆమె దహనం చేయలేదు. చనిపోయినట్టు ఎవరికీ చెప్పలేదు. చెప్పుకోలేని స్థితి ఆమెది. చనిపోయిన తల్లిని పక్కన పెట్టుకునే కాలం వెల్లదీస్తున్నది. ఆ మృతదేహం కుల్లిపోయినా... దానిని దహనం చేయలేదు. చెబుదామన్నా ఆమె దగ్గరికీ ఎవరూ రారు. వచ్చినా ఆమె మాట వినరు. ఆమె గతం అలాంటిది. దీంతో ఆమె తల్లి శవంతోనే సావాసం చేసింది. దుర్వాసనను భరించేది. శవంపై ఈగలు, దోమలు వాలితే కొట్టేది. ‘అమ్మా.. ఇంకెంత సేపు పడుకుంటావమ్మా.. లే అమ్మా..’ అని అరిచేది. ఎంతసేపటికి ఆ తల్లి లేవకపోయేది. ఆమె శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిందని గ్రహించే స్థితిలో లేని అమాయకత్వం ఆ కూతురుది.

ఈ హృదయ విదారక ఘటన ముంబయిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో తల్లి, కుమార్తె కలిసి జీవించేవారు. అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది మార్చి లో ఆ తల్లి (83) మరణించింది. కానీ ఆమె కూతురు (53) మాత్రం ఈ విషయం గురించి ఎవరికీ సమాచారం అందించలేదు. వాళ్లింటికి ఎవరూ రాకపోవడంతో ఆమె ఇన్నాళ్లు తన తల్లి శవంతోనే సావాసం చేసింది. కానీ కొద్దిరోజులుగా ఆమె ఇంటిలోని చెత్తతో పాటు మలాన్ని కూడా బయటే పడేస్తుంటం.. వాళ్లు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది అసలు విషయం. ఆ మహిళకు మతి స్థిమితం తప్పిందని.. ఆమె కొద్దిరోజులుగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నది. సదరు మహిళ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని.. ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదని తెలిసింది.

ఈ కారణంతోనే ఆమె తల్లి మరణించినా.. ఎవరికీ చెప్పలేదని పోలీసులు తెలిపారు. అంతేగాక ఆ మహిళ కొద్దిసంవత్సరాల క్రితం తాను ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోయినప్పుడు కూడా.. కుక్క శవాన్ని కొద్దిరోజుల పాటు ఇంట్లోనే దాచుకుందని వారు పేర్కొన్నారు. ఆమె తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపిన పోలీసులు.. మతిస్థిమితం తప్పిన ఆ మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published by: Srinivas Munigala
First published: November 23, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading