Home /News /crime /

WOMEN HANDED OVER HER HUSBAND TO YOUNGER SISTER FOR THE LOVER GOT MARRIED THEN SPLIT POLICE CASE IN PATNA BIHAR MKS

చెల్లెలితో కాపురానికి భర్తను ఒప్పించిన భార్య -ఆ తర్వాత జరిగిన ట్విస్టులు మామూలుగా ఉండవు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనపై ప్రేమ ఉండబట్టే భర్త చెప్పిన మాట విన్నాడని, అలాంటి వ్యక్తిని వదిలి ఉండలేనని, మళ్లీ మునుపటిలాగే తన భర్తతోనే కలిసుంటానని అపర్ణ అడిగింది. కానీ అప్భపటికే భర్తతో పూర్తిగా మమేకమైపోయిన అమూల్య.. అక్క మాటలు విని షాక్ అయింది. ఇన్నాళ్ల ప్రేమ, త్యాగాన్ని గుర్తించలేదంటూ అక్కపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తను ఇచ్చే ప్రశ్నే లేదని తెగేసి చెప్పింది. అయితే..

ఇంకా చదవండి ...
ప్రియుడిపై ఇష్టంతో ఓ యువతి తన భర్తను తెలివిగా వదిలించుకుంది. అందుకోసం సొంత చెల్లెల్ని బలిపెట్టింది. వాళ్లిద్దరికీ పెళ్లి జరిపింది.. ఎంచక్కా లవర్ తో ఎగిరిపోయింది. కొన్నాళ్ల సహజీవనంలోనే మోజు తీరడంతో వాడు ఈమెను వదిలేశాడు. దాంతో లబోదిబోమంటూ మళ్లీ చెల్లెలి దగ్గరికొచ్చింది. నా భర్తను తిరిగిచ్చేయమంటూ గొడవకు దిగింది. అక్కాచెల్లెళ్ల తగువు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నా, భర్తను వదిలేసిన అక్క ఒవైపు.. అక్క కోసం రహస్యంగా ఆమె భర్తను కట్టుకున్న చెల్లెలు ఓవైపు.. గట్టిగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై పోలీసులు చెప్పిన వివరాలివి..

బీహార్ రాజధాని పట్నాలో నివసించే అపర్ణ(పేర్లు మార్చాం) విద్యావంతురాలు. తాను పనిచేసే ఆఫీసులో రఘువీర్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పినా ఒప్పుకోలేదు సరికదా, అపర్ణకు వికాస్ అనే మరో యువకుడితో పెళ్లి చేశారు. ఇటు భర్తతో కాపురం చేయలేక, అటు ప్రియుడితో కలిసుండలేక విలవిల్లాడిపోయిన అపర్ణ ఓ తెలివైన పథకం రచించింది. తన చెల్లెలితో భర్తకు పెళ్లి చేయాలనుకుంది. అపర్ణకు అమూల్య అనే చెల్లెల్లుంది. ఆమెకూడా బాగానే చదువుకుంది. తన కోసం త్యాగం చేయాల్సిందిగా అక్క కోరడంతో అమాయకురాలైన చెల్లెలు అంగీకరించింది. రఘువీర్ తో ప్రేమ విషయాన్ని భర్త వికాస్ కు చెప్పిన అపర్ణ.. తాను ప్రియుడి దగ్గరికి వెళ్లిపోతానని, బదులుగా చెల్లెలు అమూల్యతో పెళ్లి జరిపిస్తానని చెప్పింది.

Shocking : ఆ తల్లి తన ఐదుగురు కూతుళ్లను ఊరుచివరకు తీసుకెళ్లింది.. ముగింపు అస్సలు ఊహించలేరు.. ఏం జరిగిందంటే..అపర్ణ చెప్పిన మాటకు షాక్ తిన్న భర్త.. ఆమె అంతలా కోరే సరికి సరే అన్నాడు. ఇంట్లోవాళ్లు ఈ తతంగాన్ని వద్దని వారిస్తున్నా, అపర్ణ ఒత్తిడి మేరకు అమూల్యను వికాస్ చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి జరిగిన వెంటనే అపర్ణ తన ప్రియుడు రఘువీర్ రూమ్ కి షిఫ్ట్ అపోయింది. కొన్ని నెలలపాటు సహజీనంలో బాగా ఎంజాయ్ చేశారు. తీరా పెళ్లి చేసుకుందామని అపర్ణ అడిగే సరికి రఘువీర్ నో చెప్పాడు. ఇంకొంత కాలానికి మెల్లగా ఆమెను వదిలించుకున్నాడు. దీంతో ఒంటరైపోయిన అపర్ణ మళ్లీ చెల్లెలి దగ్గరికి వెళ్ళింది..

ind-pak సరిహద్దులో పురుడు పోసుకున్న మహిళ -బుడ్డోడికి ‘బోర్డర్’అని పేరు -వాళ్లదిప్పుడు ఏ దేశం?తన భర్త ఎంతో మంచివాడని, తనపై ఉన్న ప్రేమతోనే చెప్పిన మాటకు అడ్డుచెప్పలేదని, అలాంటి వ్యక్తిని వదిలి ఉండలేనని, మళ్లీ మునుపటిలాగే తన భర్తతోనే కలిసుంటానని అపర్ణ అడిగింది. కావడానికి రెండో పెళ్లే అయినా భర్తతో పూర్తిగా మమేకమైపోయిన అమూల్య.. అక్క మాటలు విని షాక్ అయింది. ఇన్నాళ్ల ప్రేమ, త్యాగాన్ని గుర్తించలేదంటూ అక్కపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తను ఇచ్చే ప్రశ్నే లేదని తెగేసి చెప్పింది. అయితే, అపర్ణ-వికాస్ చట్టబద్దంగా విడాకులు తీసుకోలేదు కాబట్టి, అతను తనవాడేనని అపర్ణ వాదిస్తోంది. ఈ గొడవ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. ప్రస్తుతం మహిళ పోలీస్ స్టేషన్‌లో వారిద్దిరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bihar, Marriage, Patna, Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు