ఆ మూడు నగరాలు.. అత్యంత అభద్రతలో అక్కడి మహిళలు

సోషల్ ఎంటర్‌ప్రైజెస్ సేఫ్టీపిన్,ప్రభుత్వ సంస్థ కేఓఐసీఏ (కొరియా ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ) & ఎన్జీవో ఏసియా ఫౌండేషన్ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

news18-telugu
Updated: December 1, 2019, 1:14 PM IST
ఆ మూడు నగరాలు.. అత్యంత అభద్రతలో అక్కడి మహిళలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో పెచ్చరిల్లుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ఓ ఆసక్తికర సర్వే తెర పైకి వచ్చింది.దేశంలోని మూడు నగరాల్లోని మహిళలు అత్యంత అభద్రత భావానికి గురవుతున్నట్టు ఆ సర్వేలో తేలింది.అందులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్,గ్వాలియర్ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరాలు ఉన్నాయి. నిర్మానుష్య ప్రదేశాలు,భద్రత లేని ఏరియాల కారణంగా ఈ నగరాల్లోని 90శాతం మహిళలు అభద్రతా భావంలో ఉన్నట్టు వెల్లడైంది. బాధితుల్లో ఎక్కువగా విద్యార్థులు, అవివాహిత మహిళలు ఉంటున్నట్టు తేలింది. సోషల్ ఎంటర్‌ప్రైజెస్ సేఫ్టీపిన్,ప్రభుత్వ సంస్థ కేఓఐసీఏ (కొరియా ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ) & ఎన్జీవో ఏసియా ఫౌండేషన్ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

తాజా అధ్యయనం కోసం భోపాల్‌లో 219 సర్వేలు,గ్వాలియర్‌లో 75 సర్వేలు,జోధ్‌పూర్‌లో 67 సర్వేలకు సంబంధించిన డేటాను సేకరించారు. నిర్మానుష్య ప్రదేశాల్లో 89శాతం మహిళలు,రవాణా సౌకర్యం లేని ప్రదేశాల్లో 63శాతం మహిళలు, మద్యం,డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రదేశాల్లో 86శాతం,భద్రతా చర్యలు లేని ప్రదేశాల్లో 68శాతం మహిళలు అభద్రతా భావానికి గురవుతున్నట్టు తేలింది. నిత్యం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే మహిళలు కొంతమంది అభ్యంతరకర ప్రవర్తనకు,బెదిరింపులకుగురవుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ఇందులో ఎక్కువగా విద్యార్థులు(57.1శాతం),అవివాహిత మహిళలు(50.1శాతం)

ఉన్నారు.

ఇంకో విచారకర విషయమేంటంటే.. ఫిజికల్‌గా అభ్యంతరకరంగా తాకడం,నోటికి పనిచెప్పి టీజింగ్ చేయడం, తదేకంగా చూస్తూ ఇబ్బంది పెట్టడం వంటి కేసులను పోలీసులు అంతగా పట్టించుకోవడం లేదు.బహిరంగ ప్రదేశాలైన మార్కెట్స్,పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నట్టు తేలింది. ఇక 26శాతం మంది మహిళలు రోడ్లపై వెళ్తున్నప్పుడు వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది.  మహిళల పట్ల వేధింపులకు
తెరపడాలంటే మహిళా భద్రతా, పోలీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్, ఫిర్యాదులను సకాలంలో విచారించే యంత్రాంగం, నిర్మానుష్య ప్రదేశాల్లో పెట్రోలింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధ్యయనకారులు చెబుతున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: December 1, 2019, 1:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading