Home /News /crime /

WOMEN FEEDING MILK TO A CAT LEADS TO LAWSUIT BY CONDOMINIUM ASSOCIATION IN FLORIDA HSN

ఇదెక్కడి విచిత్రంరా బాబోయ్.. పిల్లికి పాలు తాగించిందని మహిళపై కేసు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వృద్ధురాలు పిల్లికి పాలు తాపించడాన్ని స్థానికులు చూశారు. వెంటనే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. అదేంటీ, పిల్లికి పాలు తాపిస్తే తప్పేంటనే కదా మీ డౌటు. ఇంత మంచి పని చేస్తే అభినందించాల్సింది పోయి కేసు పెడతారా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..

ఇంకా చదవండి ...
    78 ఏళ్ల ఓ వృద్ధురాలు. పార్కులో ఉండగా ఓ పిల్లి కనిపించింది. కారులో తన వెంట తెచ్చిన పాలను ఓ గిన్నెలో పోసి ఆ పిల్లికి పెట్టింది. పాపం, ఆకలిగా ఉందేమో, ఆ పిల్లి కూడా ఆ పాలను వెంటనే తాగేసి వెళ్లిపోయింది. ఆమె పిల్లికి పాలు తాపించడాన్ని స్థానికులు చూశారు. వెంటనే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. అదేంటీ, పిల్లికి పాలు తాపిస్తే తప్పేంటనే కదా మీ డౌటు. ఇంత మంచి పని చేస్తే అభినందించాల్సింది పోయి కేసు పెడతారా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఈ ఘటన జరిగింది అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో. అక్కడ ఓ కాలనీ వాసులు పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఆ వృద్ధురాలు చేసింది తప్పేనట. ఇంతకీ అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం.

    ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో ఓ కాలనీ సంఘం 78 ఏళ్ల జాన్ పీ హస్సీపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఓ నల్ల పిల్లికి పాలు తాగిస్తుండటాన్ని చూసిన స్థానికులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. వాస్తవానికి టాంపా రాక్వెస్ట్ క్లబ్ అసోసియేషన్ కొన్ని నిబంధనలను పెట్టుకుంది. పెంపుండు జంతువులకు మినహా మిగిలిన వాటికి కాలనీలో అనుమతి నిషేధం. వాటికి పాలు పోయడం, ఆహారాన్ని ఇవ్వడం నేరం అని ప్రత్యేకంగా ఓ నిబంధనల జాబితాను రూపొందించుకుంది. పిల్లు, శునకం వంటి వాటిని పెంచుకోవడం తప్పేమీ కాదు కానీ, నల్ల పిల్లి, గుడ్లగూబ వంటి అశుభానికి సూచకాలుగా అభావించే వాటికి ఆహారాన్ని ఇవ్వడం కూడా నేరమే. అందుకే హస్సీ అనే వృద్ధురాలిపై కాలనీ సంఘం కేసు పెట్టింది.

    ప్రస్తుతం ఈ కేసునకు సంబంధించిన విచారణ ఫ్లోరిడా కోర్టులో జరుగుతోంది. అయితే తనకు పిల్లులు, శునకాలు అంటే చాలా ఇష్టమనీ, ఎన్నో ఏళ్లుగా తాను వాటికి పాలు పోయడాన్ని అలవాటుగా మార్చుకున్నానని హస్సీ వాదిస్తోంది. నలుపు, తెలుపు వంటి విషయాల్లో తనకు బేధాలు లేవనీ, అన్ని జంతువులు ఒక్కటేనన్నది తన నమ్మకమని చెబుతోంది. రోజూ తన కార్లో కొన్ని లీటర్ల పాలను తీసుకెళ్లి పార్కుల్లో కనిపించే పిల్లులు, శునకాలకు పోస్తుంటానని చెబుతోంది. ’వాళ్లు నాపై కేసు పెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది‘ అని ఆమె వ్యాఖ్యానించింది. మరి ఈ కేసులో ఆమెకు శిక్ష పడుతుందో, లేక కేసును కోర్టు కొట్టివేస్తుందో తెలియాలంటే విచారణ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    తదుపరి వార్తలు