Very Sad: భార్యాభర్తలిద్దరూ కానిస్టేబుల్స్.. నెల క్రితమే పెళ్లి.. అద్దె ఇంట్లో కాపురం.. ఏమైందో తెలియదు గానీ..

నేత్రావతి (ఫైల్ ఫొటోలు)

బెంగళూరు ఉత్తర తాలూకా చిక్కగొల్లరహట్టి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిక్కగొల్లరహట్టి బెంగళూరు నగరానికి శివారు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఓ కొత్త జంట నివాసముంటోంది. వాళ్లే భార్యాభర్తలైన...

  • Share this:
    బెంగళూరు: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సహజం. అలకలు, బుజ్జగింపులు సర్వ సాధారణం. కానీ.. చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగితే అపార్థాలు పెరుగుతాయి. ఆ అపార్థాలు, మనస్పర్థలు అనర్థాలకు దారితీస్తాయి. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు ఉత్తర తాలూకా చిక్కగొల్లరహట్టి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిక్కగొల్లరహట్టి బెంగళూరు నగరానికి శివారు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఓ కొత్త జంట నివాసముంటోంది. వాళ్లే భార్యాభర్తలైన కానిస్టేబుల్స్ మంజునాథ్, నేత్రావతి. వీరిలో నేత్రావతి(27) సొంతూరు తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా తవినికెరె గ్రామం. నేత్రావతి పాళ్యాలోని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఒకే డిపార్ట్‌మెంట్ కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. మంజునాథ్ పీణ్యా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరూ నెల క్రితం పోలీసు అధికారుల సమక్షంలో, ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

    ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ.. వీరి మధ్య మనస్పర్థలు రావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. కానిస్టేబుల్ ఉద్యోగాలు చేసుకుంటూ శివారు ప్రాంతమైన చిక్కగొల్లరహట్టిలో అద్దెకు ఇల్లు తీసుకున్న ఈ జంట చిన్నచిన్న విషయాలకే గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే.. వంట చేసే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

    ఇది కూడా చదవండి: Shocking: ఈమె కన్న తండ్రికి అసలు మనసనేది ఉందా.. కూతురి పుట్టినరోజు అని.. ఆమెను పుట్టింటికి పిలిచి..

    ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. తన భర్త ప్రేమగా చూసుకోవడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన నేత్రావతి భర్త మరొక గదిలో ఉన్న సమయంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. అయితే.. నేత్రావతి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించడంతో పోలీసులు ఆమెది నిజంగా ఆత్మహత్యేనా లేక భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: