16 ఏళ్ల మైనర్ బాలుడితో బలవంతంగా శృంగారం చేసిన మహిళ అరెస్టు..

ఆ యువకుడిని అదే తరహాలో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. అంతే కాదు ఇంకా కొంత మంది పిల్లలను, కౌమార దశలోని యువకులను కూడా కైలిగ్ తన ట్రాప్ లో లాగడం మొదలు పెట్టింది. 

news18-telugu
Updated: September 2, 2019, 11:22 PM IST
16 ఏళ్ల మైనర్ బాలుడితో బలవంతంగా శృంగారం చేసిన మహిళ అరెస్టు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 2, 2019, 11:22 PM IST
యూకేకు చెందిన కైలిగ్ మార్టిన్ 16 సంవత్సరాల యువకుడిపై లైంగిక దాడి చేసిన ఆరోపణలతో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, కైలిగ్ మార్టిన్ స్థానికంగా ఉన్న రెసిడెన్షియల్ చైల్డ్ కేర్ సెంటర్ లో పనిచేస్తోంది. అయితే అక్కడికి తరచూ వచ్చే యువకుడిపై కైలిగ్ కన్నేసింది. అతడితో చనువుగా ఉంటూ మాటా మంతి కలిపింది. అయితే ఇది గమనించిన ఆ యువకుడు కైలిగ్ కు దూరంగా ఉంటూ వచ్చాడు. అయినప్పటికీ కైలిగ్ ఎలాగైన ఆ యువకుడిని తన ఉచ్చులో దింపాలని ప్లాన్ చేసి అతడిని లొంగదీసుకొని బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాదు ఎవరికైనా చెబితే అతని ఫోటోలను, క్లిప్పింగ్స్ ను సోషల్ మీడియాలో పెడతానని బెదరించింది.

అయితే తరచూ ఆ యువకుడిని అదే తరహాలో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. అంతే కాదు ఇంకా కొంత మంది పిల్లలను, కౌమార దశలోని యువకులను కూడా కైలిగ్ తన ట్రాప్ లో లాగడం మొదలు పెట్టింది.  ఈ వ్యవహారం గమనించిన చైల్డ్ కేర్ సెంటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే ఆమె సెల్ ఫోన్, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. అలాగే కైలిగ్‌పై లైంగిక దాడి, అలాగే చీటింగ్ కేసుల్లో బుక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...