కల్లు వివాదంలో కలెక్టర్‌కు సూసైడ్ నోట్ రాసిన మహిళ

ఇటీవల లాస్య గౌడ్ అనే మహిళ తన కల్లు దుకాణంలో మద్యం కూడా అమ్మడం మొదలుపెట్టింది. ఇలా అయితే కల్లుకు బదులు మద్యాన్ని కొనుగోలు చేస్తారని గౌడ సంఘం వారు దీనిని వ్యతిరేకించారు.

news18-telugu
Updated: August 4, 2019, 12:36 PM IST
కల్లు వివాదంలో కలెక్టర్‌కు సూసైడ్ నోట్ రాసిన మహిళ
నమూనా చిత్రం
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో కల్లు వివాదం కలకలం రేపింది. దీంతో కలెక్టర్‌కు సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య యత్నానికి పాల్ప‌డింది ఓ మ‌హిళ‌. ప్రస్తుతం ఆమె  జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమే ఈ వివాదంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తెలుస్తోంది. జామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే...  నీలా గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి కల్లు సొసైటీపై కేసు నమోదు చేసి ఉంది. అప్పట్నుంచి  కల్లు విక్రయించడానికి వీల్లేదని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

లాస్య సూసైడ్ నోట్


అయితే గత కొన్ని రోజుల నుంచి గ్రామంలోని కొందరు ఎక్సైజ్ శాఖలో అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయిస్తున్నారు. దీంతో ఇటీవల లాస్య గౌడ్ అనే మహిళ తన కల్లు దుకాణంలో మద్యం కూడా అమ్మడం మొదలుపెట్టింది. ఇలా అయితే కల్లుకు బదులు మద్యాన్ని కొనుగోలు చేస్తారని గౌడ సంఘం వారు దీనిని వ్యతిరేకించారు.  దీంతో లాస్య గౌడ్ ఎక్సైజ్ సీఐ చట్ట విరుద్ధంగా కల్లు విక్రయిస్తున్నారని  పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే నీలాలో కల్లు విక్రయాన్ని ఆపాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో ఎక్సైజ్ అధికారి గుత్తేదారుకు ఫిర్యాదు విషయాన్ని తెలిపారు. దీంతో గౌడ కులస్తులు లాస్య మామయ్యను పిలిపించి కేసు విత్ డ్రా చేసుకోవాలని కోరారు. లేకపోతే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించినట్లు కలెక్టర్‌కు రాసిన లేఖలో లాస్క పేర్కొన్నారు. కుల సంఘాల ముందు తనను మాట్లాడనివ్వలేదని ఎక్సైజ్ అధికారులు కల్లు బంద్ చేయించడం పోయి తనను తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు.  కొందరు కులస్తులు గుత్తేదార్లతో పాటు ఎక్సైజ్ అధికారి తన ఆత్మహత్యకు కారణమని కలెక్టర్ కు రాసిన లేఖలో లాస్క పేర్కొన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. లాస్య‌ గౌడ్ నుంచి వాంగ్మూలం సేకరించినట్లు రెంజల్ పోలీసులు తెలిపారు.
First published: August 4, 2019, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading