పగలు పనిమనిషి.. అందులో థ్రిల్ లేదని.. రాత్రి పూట...

ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని కాలనీలో రౌండ్లు కొడుతూ ఎక్కడ ఒంటరిగా వెళ్తున్న మహిళలు కనిపిస్తే వారి మెడలో చైన్లు కొట్టేయడం మొదలు పెట్టారు.

news18-telugu
Updated: April 17, 2019, 9:22 PM IST
పగలు పనిమనిషి.. అందులో థ్రిల్ లేదని.. రాత్రి పూట...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 17, 2019, 9:22 PM IST
ఆమె పగలు ఏమీ తెలియనట్టు ఓ ఇంట్లో పనిమనిషిలా పనిచేస్తుంది. సాయంత్రం డ్యూటీ అయిపోయిన వెంటనే ఆమెలో రెండో వ్యక్తి బయటకు వస్తుంది. రోడ్డు మీద యువకుడితో కలసి చైన్ స్నాచింగ్ చేస్తుంది. పని పూర్తవ్వగానే మామూలుగా ఇంటికి వెళుతుంది. మళ్లీ మార్నింగ్ నిద్ర లేవగానే యధావిధిగా ఇంట్లో పనిమనిషిలా మారిపోతుంది. న్యూఢిల్లీలో ఈ కిలాడీ లేడీని పోలీసులు పట్టుకున్నారు. బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన రేష్మా ప్రవీణ్ తన కుటుంబంతో ఐదు నెలల క్రితం ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆమెకు గుడ్డు అనే యువకుడు పరిచయం అయ్యాడు. మాటల మధ్యలో అతడు దొంగతనం గురించి చెప్పాడు. ఇదేదో థ్రిల్లింగ్‌గా ఉందని భావించిన యువతి ఆమె కూడా మొదలు పెట్టింది.

ఇంట్లో పని అయిపోయిన వెంటనే బయటకు రావడం, గుడ్డుతో కలసి బైక్ ఎక్కడం... ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని కాలనీలో రౌండ్లు కొడుతూ ఎక్కడ ఒంటరిగా వెళ్తున్న మహిళలు కనిపిస్తే వారి మెడలో చైన్లు కొట్టేయడం మొదలు పెట్టారు. ఇలా ఐదు నెలలుగా సాగుతోంది. ఆమెకు ఇదంతా థ్రిల్లింగ్‌గా అనిపించడంతో గుడ్డు ఒక్కడే కాదు. అతడి బ్యాచ్‌లో ఉన్నవారితో కూడా కలసి బైక్ మీద వెళ్లి చైన్ స్నాచింగ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా గుడ్డు అనే వ్యక్తి బైక్ మీద వెళ్తూ ఓ మహిళ మెడలో చైన్ లాగబోయింది. ఆ సమయంలో అతడు బైక్ స్కిడ్ కావడంతో ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే స్థానికులు పరుగున వచ్చి రేష్మా ప్రవీణ్‌ను పట్టుకున్నారు. గుడ్డు పారిపోయాడు. ఆమెను విచారిస్తే, ఈ తతంగం మొత్ం బయటపడింది. అయితే, తమ కుమార్తె చేసే డబుల్ రోల్ గురించి వారి ఇంట్లో వారికి తెలియదట.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...