రొమాంటిక్ నవల రాసిన రచయిత్రి తన భర్త హత్య కేసులో విచారణను ఎదుర్కొంటోంది. ఇంతకు ముందు 'భర్తను ఎలా చంపాలి' అనే శీర్షికతో రచయిత ఓ కథనాన్ని రాసుకోవడం ఆసక్తికరంగా మారింది. 71 ఏళ్ల వయసున్న నాన్సీ క్రాంప్టన్-బ్రోఫీ ఈ కథనాన్ని 2011లో రాశారు. ఈ కథనంలో తన భర్తను చంపడానికి గల ఉద్దేశ్యం, మార్గాల గురించి ఆమె వివరంగా రాశారు. ఇప్పుడు అదే రచయిత్రి తన భర్తను కాల్చిచంపినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నాన్సి క్రాంప్టన్ భర్త డేనియల్ బ్రోఫీ ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లోని ఒక కులినరీ ఇన్‌స్టిట్యూట్ వంటగదిలో చనిపోయాడు. ఆయన సహచరులలో ఒకరు ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన శరీరంలోని వీపు, ఛాతీపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి.
కోర్టులో సమర్పించిన పత్రాల ప్రకారం.. డేనియల్ చనిపోయినప్పుడు, నిందితుడు భార్య పోర్ట్ ల్యాండ్ ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత నిందితురాలు తన భర్త మరణ వార్తను ఫేస్‌బుక్‌లో పంచుకుంది. ఆమె తన పోస్ట్‌లో తన భర్త, ఆయన స్నేహితుడు చెఫ్ డాన్ బ్రోఫీ చంపబడ్డారని పేర్కొంది. తనకు ఏమి చేయాలో తెలియదని రాసుకొచ్చింది. ఈ అంశంపై స్పందించిన వారికి ధన్యవాదాలు కూడా తెలిపింది. అనంతరం 2018 సెప్టెంబర్‌లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ ఆమె తనను నిర్దోషిగా చెప్పుకుంది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొంది.
క్రాంప్టన్ బ్రోఫీ ఒకప్పుడు ప్రసిద్ధ నవలా రచయిత. ఆమె రాసిన నవల 'ది రాంగ్ లవర్ అండ్ రాంగ్ హస్బెండ్' 2011లో హౌ టు మర్డర్ యువర్ హజ్బెండ్ ఆర్టికల్ వార్తల్లో నిలిచాయి.
రెండేళ్ల క్రితమే ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే కరోనా కారణంగా కేసు విచారణ రెండేళ్లపాటు వాయిదా పడింది. కానీ ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. క్రాంప్టన్ బ్రోఫీ తన భర్త పేరు మీద ఉన్న మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం అతడిని చంపిందా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. డేనియల్ బ్రోఫీ కుటుంబానికి హంతకుడిని కనుగొనడంలో ఈ వ్యవహారంలో సహాయపడవచ్చు. క్రాంప్టన్ బ్రోఫీపై ప్రస్తుతం హత్య, అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.