Home /News /crime /

WOMAN WHO SECRETLY POKED HOLES IN PARTNER CONDOMS TO GET PREGNANT IS JAILED AFTER STEALTHING PVN

ప్రియుడి కండోమ్స్ కి రంధ్రాలు..ప్రియురాలికి జైలు శిక్ష

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman poked holes in partner condoms : గర్భం దాల్చేందుకు తన భాగస్వామి కండోమ్‌కు రంధ్రాలు వేసిన మహిళ జైలు పాలైంది. జర్మనీలో నివసించే 39 ఏళ్ల ఓ మహిళ గత కొన్నాళ్లుగా 42 ఏళ్ల వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది.

Woman secretly poked holes in partner condoms : గర్భం దాల్చేందుకు తన భాగస్వామి కండోమ్‌కు రంధ్రాలు వేసిన మహిళ జైలు పాలైంది. జర్మనీలో నివసించే 39 ఏళ్ల ఓ మహిళ గత కొన్నాళ్లుగా 42 ఏళ్ల వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది. ఇరువురికీ గతేడాది ఆన్ లైన్ లో పరిచయం ఏర్పడగా.. ఒకరినొకరు ఇష్టపడటంతో ప్రేమ చిగురించింది. దీంతో సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. శారీరక సంబంధం ఏర్పడటంతో కొద్ది రోజుల్లోనే అతడంటే పిచ్చి ప్రేమను పెంచుకుంది. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని,అతనితో జీవితం పంచుకోవాలని ఆమె భావించింది.అతడిని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అయితే ప్రియుడు తనను వివాహం చేసుకోడని అనుమానించిన ఆమె.. ఓ పథకం వేసింది. అతడి వల్ల తాను తల్లినైతే పెళ్లిచేసుకుంటాని అనుకుంది. ఈ క్రమంలో ప్రియుడుతో సెక్స్ సమయంలో అతడికి తెలియకుండా కండోమ్ కి రంధ్రాలు చేసింది. అయితే ఈ విషయం తెలియక అతడు..ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడు. దీంతో కొద్ది రోజులకు ఆ మహిళ గర్భం దాల్చింది. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

శృంగారంలో పాల్గొన్నప్పుడు కండోమ్ కి ఉద్దేశపూర్వకంగా రంధ్రాలు చేసినట్లు ఆమె చెప్పిన మాటలు విని ప్రియుడు షాక్ అయ్యాడు. ఇలా ఎందుకు చేశావ్ అని ఆమెను నిలదీశాడు. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా..నువ్వు ఒప్పుకోవేమోనన్న అనుమానంతో ఇలా చేశా అని ప్రియురాలు చెప్పడంతో ఆగ్రహించిన ప్రియుడు కోర్టుకు వెళ్లి ఆమెపై నేరారోపణలు చేశాడు. అతడి అభ్యర్థనను పరిశీలించిన కోర్టు.. ప్రియురాలు "స్టెల్తింగ్"(నేరం)కు పాల్పడినట్లు నిర్ధారించింది. ఇది కూడా ఓ రకంగా లైంగిక దాడి కిందికే వస్తుందని స్పష్టం చేసింది. దీంతో సదరు మహిళకు 6 నెలల జైలు శిక్ష విధించింది. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు భాగస్వామికి తెలియకుండా మోసపూరితంగా కండోమ్ తొలగించినా, రంధ్రాలు చేసినా జర్మనీలో నేరంగా (స్టెల్తింగ్) పరిగణిస్తారు.

ALSO READ Astrology:మే 15 నుండి ఈ 6 రాశుల వారికి అదృష్టం మాములుగా ఉండదు

ఈ కేసులో అరెస్టయిన మొట్టమొదటి మహిళ ఈమే కావడం గమనార్హం. ఈ కేసులో తీర్పు ఇవ్వడం అంత సులభం కాదు.. ఆ మహిళపై ఎలాంటి అభియోగాలు మోపాలనే విషయమై తర్జన భర్జనపడ్డాం అని జడ్జ్ ఆస్ట్రిడ్ సాలెవ్స్కీ అన్నారు. మేము ఈ రోజు న్యాయశాస్త్రంలో కొత్త చరిత్రను రాశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు .లైంగిక చర్య సమయంలో ఒక వ్యక్తి తన భాగస్వామికి తెలియకుండా కండోమ్‌ను రహస్యంగా తీసివేస్తే దానిని 'స్టెల్తింగ్'గా పరిగణిస్తారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పును చారిత్రకంగా అభివర్ణించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Germany, Jails, WOMAN

తదుపరి వార్తలు