Home /News /crime /

acid attack : ఇద్దరు పిల్లల తల్లి ప్రేమ బాగోతం -ఆ పనికి యువకుడు ఒప్పుకోలేదని..

acid attack : ఇద్దరు పిల్లల తల్లి ప్రేమ బాగోతం -ఆ పనికి యువకుడు ఒప్పుకోలేదని..

నిందితురాలు షీబా, యాసిడ్ దాడి దృశ్యాలు

నిందితురాలు షీబా, యాసిడ్ దాడి దృశ్యాలు

ఇద్దరు పిల్ల తల్లి భర్తతో ఎలాంటి గొడవలు లేకున్నా, ఇంకా ఏదో కావాలనే కోరికతో ఓ యువకుడిని ప్రేమించింది. సింగిల్ విమెన్ స్టేటస్ తో అతనికి దగ్గరైంది. పెళ్లి చేసుకునేదాకా వెళ్లినా, ఈమె వివాహిత అని తెలియడంతో అతను దూరమయ్యాడు. కక్ష పెంచుకున్న ఆమె చివరికి అతనిపై యాసిడ్ పోసి శాశ్వతంగా చూపు లేకుండా చేసింది..

ఇంకా చదవండి ...
పండంటి ఇద్దరు పిల్లలు.. ఏది చెప్పినా వింటూ ప్రేమగా చూసుకునే భర్త.. అందుబాటులో సకల వసతులు.. పొద్దికైన ఇల్లు.. ఏ బాదర బందీ లేని జీవితం.. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక సాధారణ గృహిణికి స్వర్గంలాంటి జీవితమది. అయితే, ఆమెకు మాత్రం ఇంకా ఏదో కావాలనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. ఫేస్ బుక్ లో పరిచయమైన యువకుడితో ప్రేమాయణం మొదలుపెట్టింది. సింగిల్ విమెన్ స్టేటస్ చూసి అతను కూడా బాగా ఫార్వర్డ్ అయ్యాడు. పీకల్లోతు ప్రేమలో పడిపోయానని, ఇక ఇల్లూ,పిల్లల్ని వదిలేసి వెళ్లాలని ఆమె డిసైడైంది. వయసు తేడా ఉన్నా అతను ఒకే అనుకున్నాడు. చివరి నిమిషంలో ఆమె వివాహిత అని తెలియడంతో పెళ్లి వద్దనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అతణ్ని వదల్లేదు. పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుపట్టింది. చివరికి తనకు దక్కనివాడు ఎవరికీ దక్కొద్దన్న అక్కసుతో ఆ అబ్బాయిపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేసింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. కేరళలోని ఇడుక్కి జిల్లా పోలీసులు చెప్పిన వివరాలివి..

ఇడుక్కి జిల్లాలోని అదిమళి గ్రామానికి చెందిన షీబా(35) గృహిణి. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంసారం సాఫీగా సాగుతున్నా, అదనపు ప్రేమను పొందాలనుకున్న ఆమెకు.. ఫేస్ బుక్ లో అరుణ్ కుమార్(28) అనే యువకుడు పరిచయం అయ్యాడు. పూజప్పరకు చెందిన అరుణ్.. తిరువనంతపురంలో పనిచేసుకుంటున్నాడు. తాను సింగిల్ విమెన్ అని చెప్పుకుని షీబా.. అరుణ్ కు దగ్గరైంది. పరిచయం ప్రేమగా, అప్పుడప్పుడూ కలుసుకునేంత వరకూ వెళ్లింది.

నారా భువనేశ్వరిపై వైసీపీ దారుణ కామెంట్లు.. తల్లి బసవతారకం స్వగ్రామంలో నేడు మహాధర్నాఇక విడిగా ఉండలేనని, పెళ్లి చేసుకుందామని షీబా ప్రపోజ్ చేయగా, అరుణ్ కూడా ఒప్పుకున్నాడు. ప్రేమలో ఉన్నప్పుటి కంటే పెళ్లిలో నమ్మకం తప్పనిసరి అని భావించిన అతను.. ఆమె గురించి ఎంక్వైరీ చేయగా, షీబాకు అప్పటికే పెళ్లయి, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. దీంతో షాక్ కు గురైన అరుణ్.. షీబాతో పెళ్లి ఆలోచన రద్దుచేసుకున్నాడు. అంతేకాదు, ఆమెను పూర్తిగా దూరంపెట్టేశాడు. అయితే షీబా మాత్రం..

Hyderabad : అమ్మమ్మతో అక్రమ సంబంధం.. 11 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం -80ఏళ్ల వృద్దుడి అఘాయిత్యం


తనది స్వచ్ఛమైన ప్రేమ అని, భర్త, పిల్లల్ని కూడా వదిలేసి రావడానికి సిద్ధంగా ఉన్నానని అరుణ్ ను నమ్మించే ప్రయత్నం చేసింది షీబా. కానీ అతను ఎంతకూ అంగీకరించకపోవడంతో షీబా బ్లాక్ మెయిల్ కు దిగింది. వాళ్లిద్దరూ కలిసున్నప్పటి వీడియోలు, ఫొటోలను లీక్ చేస్తానని, ఇక జన్మలో వేరే పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంటానని బెదిరింస్తూ అతణ్ని డబ్బులు డిమాండ్ చేసింది. ఆమె కోరినట్లు డబ్బులు ఇవ్వడానికి కూడా యువకుడు సిద్దమైనా..

Kaikala Satyanarayana : మరింత విషమించిన కైకాల ఆరోగ్యం -పని చేయని అవయవాలు -డాక్టర్లు ఏమన్నారంటేషీబాను వదిలించుకోడానికి అరుణ్ డబ్బులివ్వడానికి కూడా సిద్ధమైనా ఆమె మాత్రం ఎంతకూ వెనక్కి తగ్గలేదు. పెళ్లి ప్లాన్ బెడిసికొట్టడంతో ఆమె మరో పథకం వేసుకుని అతణ్ని కలవడానికి వెళ్లింది. డబ్బులు చేత పట్టుకున్న అరుణ్.. ఈనెల 16న అదిమళిలోని చర్చ వద్ద షీబాను కలిశాడు. అతనితో మాట్లాడుతున్నట్లే నటించి.. వెంట తెచ్చుకున్న సీసా బయటికి తీసి అరుణ్ పై యాసిడ్ కుమ్మరించింది షీబా. ఈ ఘటనలో..

భువనేశ్వరికి అవమానం తట్టుకోలేక -చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ -శపథం నెరవేరుతుంది!


వివాహిత జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అరుణ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి సహాయం చేశారు. యాసిడ్ దాడిలో షీబాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అరుణ్ పరిస్థితి విషమించడంతో అతణ్ని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు. యాసిడ్ దాడిలో అరుణ్ కళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, చూపు కోల్పోయాడని, ముఖం, మెడ భాగం కూడా దెబ్బతిందని డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితురాలు షీబాను అరెస్ట్ చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Crime news, Kerala, Married women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు