• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • WOMAN WHO HAD SEXUAL CONTACT THREE TIMES WITH A BOY WHO SHE MET ON THE INTERNET AVOIDS JAIL IN LONDON SK

మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న యువతి.. కోర్టు సంచలన తీర్పు

మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న యువతి.. కోర్టు సంచలన తీర్పు

ప్రతీతాత్మక చిత్రం

బాలుడు మైనర్ అనే విషయం ఆమెకు తెలియదని.. కేవలం ఐదుసార్లు మాత్రం శారీరంగా కలిశారని డిఫెన్స్ లాయర్ కోర్టుకు తెలిపారు. అతడికి 14 ఏళ్లే ఉన్నాయని తెలిసి ఆ తర్వాత దూరమైందని చెప్పారు.

  • Share this:
    రెండేళ్ల కిందటి కేసు ఇది. ఆమెకు 22 ఏళ్లు. బాలుడికి 14 ఏళ్లు. వయసులో తన కంటే చిన్న వాడైన బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. వారిద్దరు ఐదు సార్లు శృంగారంలో పాల్గొన్నారు. ఐతే బ్రిటన్ చట్టాల ప్రకారం.. 16 లోపు పిల్లలతో లైంగిక సంబంధ పెట్టుకోవడం పెద్ద నేరం. అలాంటి కేసుల్లో కనిష్టంగా పదేళ్ల నుంచి గరిష్టం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం అలాంటి శిక్షలేవీ పడలేదు. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు.. ఆ యువతికి క్షమాభిక్ష ప్రసాదించి వదిలేసింది. దీనికి బలమైన కారణమే ఉంది.

    ఇంగ్లండ్‌లోని న్యూకాజిల్‌లో నివసిస్తున్న సోఫీ జాన్సన్‌‌కు రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా 14 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత లైంగిక సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో.. న్యూకాజిల్‌ క్రౌన్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఐతే ఈ కేసులో రొటీన్‌కు భిన్నంగా డిఫెన్స్‌ న్యాయవాదితో పాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కూడా యువతికి సానుకూలంగా వాదించారు. ఆ బాలుడు మైనర్ అనే విషయం ఆమెకు తెలియదని.. కేవలం ఐదుసార్లు మాత్రం శారీరంగా కలిశారని డిఫెన్స్ లాయర్ కోర్టుకు తెలిపారు. అతడికి 14 ఏళ్లే ఉన్నాయని తెలిసి ఆ తర్వాత దూరమైందని చెప్పారు. బాలుడిపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని.. పరస్పరం అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని వివరించారు.

    అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో బాలుడి వాంగ్మూలం కూడా సోఫీకి వ్యతిరేకంగా లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ బాలుడికి 16 ఏళ్లు ఉన్నాయని.. త్వరలో మైనారిటీ తీరిపోయాక ఓసారి సోఫీని కలుసుకోవాలని కోరుకుంటున్నాడని తెలిపారు. అటు ఈ రెండేళ్లలో సోఫీ ఎంతో శిక్షను అనుభించారని, ఇంటి నుంచి కూడా గెంటివేశారని కోర్టుకు చెప్పారు. ఉన్న ఉద్యోగం కూడా పోయి.. ఎన్నో ఇబ్బందులు పడిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెను క్షమించి వదిలివేయవచ్చని కోర్టును అభ్యర్థించారు.

    ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు...సోఫికి శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. పరస్పరం అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నందున, ఎలాంటి శిక్ష విధించడం లేదని చెప్పారు. ఐతే మైనర్ బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నందన మూడేళ్ల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు. ఐదేళ్లపాటు లైంగిక నేరస్థుల రిజిస్టర్‌‌లో సంతకం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ తీర్పు ఇప్పుడు బ్రిటన్‌లో చర్చనీయాంశమైంది.
    First published:

    అగ్ర కథనాలు