(K.Veeranna,News18,Medak)
మూడు ముళ్ల బంధం కొందరికి ముళ్లుగా మారుతున్నాయి. జీవితాంతం కలిసి జీవించాల్సిన భార్య, భర్తల మధ్య పరాయి మగవాడు చేరడంతో కలహాలు, వివాహేతర సంబంధాలకు (Extra marital relationship) దారి తీస్తున్నాయి. పెళ్లి చేసుకొని...పుష్కర కాలం కాపురం చేసిన తర్వాత మూడో వ్యక్తిపై పుట్టిన మోజుతో భార్యే మొగుడ్ని హత్య (Murder)చేయించిన ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఆనందానికి అడ్డుపడుతున్నాడని హత్య చేసిన ఇద్దరూ జైలు (Prison)పాలయ్యారు.
జిమ్ ట్రైనర్‌పై ఉన్న మోజుతో..
భర్తతో వైవాహిక జీవితాన్నిఅన్యోన్యంగా పంచుకోవాల్సిన భార్య అడ్డదార్లు తొక్కింది. సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పరిధిలోని బీరంగూడలో పండ్ల దుకాణం నడుపుకుంటున్నయశోద అనే వివాహితకు 14సంవత్సరాల క్రితం కామారెడ్డి జిల్ా మద్నూర్‌కు చెందిన ఎరుకల శంకరయ్యతో వివాహం జరిగింది. ఇద్దరూ బీరంగూడలో పండ్ల వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. శంకరయ్య రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని టంగటూర్ గ్రామ శివార్లలో ఎకరం దానిమ్మ తోట కౌలు తీసుకున్నారు. అక్కడే ఉంటూ వారం రోజులకు ఒకసారి భార్య యశోద దగ్గరకు వచ్చిపోతున్నాడు. భర్త తోట పని మీద వెళ్లిన క్రమంలోనే యశోదకు బీరంగూడలోని మజిల్ టేక్టన్ జిమ్ ట్రైనర్ తిరుపతిరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలుసుకోవడంతో భర్త శంకరయ్యపై యశోదకు విరక్తి పుట్టింది. పాతికేళ్ల వయసున్న జిమ్ ట్రైన్‌తో తాత్కాలిక శారీరక సుఖానికి అలవాటు పడి అతనితో జీవితాన్ని కొనసాగించాలని పథకం వేసుకుంది. ఇందులో భాగంగానే తన భర్త శంకరయ్యను చంపమని ప్రియుడు తిరుపతిరావుకు చెప్పింది యశోద.
మొగుడు మర్డర్‌కి భార్య స్కెచ్..
భర్తను ప్రియుడితో హత్య చేయించాలన్న యశోద పథకంలో భాగంగానే ఈనెల 11వ తేది శంకరయ్య రంగారెడ్డి జిల్లాలోని టంగుటూర్‌లోని దానిమ్మ తోటకు బయల్దేరాడు. ఆదే విషయాన్ని యశోధ ప్రియుడు తిరుపతిరావుకు ఫోన్ చేసి చెప్పింది యశోద. ఆంటీ మోజులో పడిన జిమ్ ట్రైనర్ తిరుపతిరావు శంకరయ్యను బైక్‌పై ఫాలో అయ్యాడు. సరిగ్గా టంగటూర్ గ్రామ శివారులోకి చేరుకోగానే శంకరయ్య బైక్‌కు కర్రను అడ్డుపెట్టి కిందపడిపోగానే తలపై కర్రతో బలంగా కొట్టాడు తిరుపతిరావు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో శంకరయ్య గొంతు కోసిన యశోద ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. మర్డర్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా శంకరయ్యను హత్య చేసింది అతని భార్య ప్రియుడు తిరుపతిరావు అని తేల్చారు.
ప్రియుడి చేతులతో భర్త హత్య ..
నిందితుడు తిరుపతిరావు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. శంకరయ్యను భార్య యశోద చెప్పినందుకే తాను హత్య చేసినట్లుగా ఒప్పుకోవడంతో చేవెళ్ల పోలీసులు నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మృతుడి భార్య యశోదతో పాటు తిరుపతిరావు వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ని స్వాదీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల్ని రిమాండ్‌కు తరలించినట్లుగా చేవేళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extra marital affair, Sangareddy, Telangana crime news, Wife kill husband