హోమ్ /వార్తలు /క్రైమ్ /

Cheating Woman : ఉమాదేవి ఉచ్చులో పడి కోటి రూపాయలు నష్టపోయిన కూలీలు .. ఏం ఆశ పెట్టిందో తెలిస్తే షాక్ అవుతారు

Cheating Woman : ఉమాదేవి ఉచ్చులో పడి కోటి రూపాయలు నష్టపోయిన కూలీలు .. ఏం ఆశ పెట్టిందో తెలిస్తే షాక్ అవుతారు

cheating woman

cheating woman

Crime news: చిట్టీల పేరుతో కాయ, కష్టం చేసుకొని బ్రతికే పేదలు, కూలీల దగ్గర డబ్బులు వసూలు చేసింది. సొంత ఇల్లు ఉండటంతో అందరూ నమ్మి ఆమెకు డబ్బులు కట్టారు. పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరగానే మహిళ మాయమైపోయింది. సంగారెడ్డి జిల్లాలో ఖిలాడీ లేడీ ఏం చేసిందో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

చిట్టీల(Chits)పేరుతో అమాయకులకు వల వేసింది. తన మాటలు, బిల్డప్ చూపించి కాయ, కష్టం చేసుకొని బ్రతికే పేదలు, కూలీల(Laborers)ను తన వైపు తిప్పుకుంది. మంచి మాటలు చెప్పి వాళ్ల దగ్గర నెల నెలా డబ్బులు వసూలు చేసింది. చిట్టీలు వేసిన మహిళకు సొంత ఇల్లు ఉండటంతో అందరూ నమ్మారు. అవసరానికి పనికొస్తాయని పని చేసుకొని సంపాధించుకున్న డబ్బును ఆమెకు చిట్టీల పేరుతో అప్పగించారు. సీన్ కట్ చేస్తే సదరు మహిళ కోటి రూపాయలు(One crore rupees)పెద్ద సమకూరగానే ఎవరికి కనిపించకుండా మాయమైపోయింది. సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో ఖిలాడీ ముసుగులో లేడీ చేసిన మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

Telangana : మరో 15మంది గురుకుల పాఠశాల అమ్మాయిలకు వాంతులు, విరోచనాలు .. కారణం ఏంటో తెలుసా..?

కోటితో మాయమైన కిలాడీ లేడీ..

సంగారెడ్డి జిల్లాలో మరో కిలాడీ లేడీ ఉచ్చులో పడ్డారు అమాయకులు. పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో నివాసముంటున్న ఉమాదేవి అనే మహిళ చిట్టీల పేరుతో రోజు వారీ కూలీ పనులు చేసుకునే వాళ్లు, ఇళ్లలో పనులు చేసుకునే వారి దగ్గర డబ్బులు కట్టించుకుంది. వాళ్ల అవసరాలకు చిట్టీ మధ్యలో డబ్బులు అడిగినప్పటికి ఇవ్వకుండా చివర్లో పెద్ద మొత్తంలో ఇస్తానంటూ నమ్మబలికింది మాయలేడీ. ఈవిధంగా ఒకరిద్దరు కాదు సుమారు పదుల సంఖ్యలో అమాయకుల్ని మోసం చేసి సుమారు కోటి రూపాయలు వసూలు చేసింది.

చిట్టీల పేరుతో చీటింగ్ ..

చిట్టీలు చివరికి రావడంతో డబ్బులు కట్టిన వాళ్లకు తిరిగి చెల్లించాల్సి వస్తుందని గత కొద్ది రోజులుగా ఇంటిని అమ్మేందుకు బేరం పెట్టి తన ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసుకుంది. అయితే బాధితులు ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానించి ఇంటికి చేరుకున్నారు. అందరికి పంగనామం పెట్టి కోటి రూపాయలతో ఉమాదేవి పారిపోయిందని తెలుసుకున్నారు బాధితులు. వెంటనే పోలీసులను ఆశ్రయించి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. ముత్తంగి సాయిప్రియకాలనీలో ఉంటున్న ఉమాదేవి శ్రీకాళహస్తి ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె ఇల్లు కూడా అమ్ముకొని పారిపోయినట్లుగా తేల్చారు.

Snake Catcher: పాములు పట్టడంలో ఆమెకు ఆమె సాటి.. ఇప్పటివరకు ఎన్నిపాములు పట్టిందో తెలుసా..?

మాయగాళ్ల ఉచ్చులో పడకండి..

కూతురు పెళ్లికి అవసరమవుతాయని కొందరు ..ఇల్లు కొట్టుకోవడానికి పని కొస్తాయని మరికొందరూ కష్టం చేసిన డబ్బంతా మాయలేడికి ఇచ్చామని ..ఎలాగైనా తమకు న్యాయం చేసి కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసుల్ని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోటి రూపాయలతో ఉడాయించిన ఉమాదేవి కోసం గాలిస్తామన్నారు. ఇకపై ఎవరైనా చిట్టీల పేరుతో మోసం చేయాలని చూస్తే వాళ్ల ఉచ్చులో పడవొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

Published by:Siva Nanduri
First published:

Tags: Criminal women, Sangareddy, Telangana crime news

ఉత్తమ కథలు