• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • WOMAN WHATSAPP CALL TO YOUTH AND SHOOTS NUDE VIDEO AT MUMBAI NK

యువకుడి నగ్న వీడియో తీసి... యువతి బ్లాక్ మెయిల్... బాధితుడు లబోదిబో...

యువకుడి నగ్న వీడియో తీసి... యువతి బ్లాక్ మెయిల్... బాధితుడు లబోదిబో...

యువకుడి నగ్న వీడియో తిసి... యువతి బ్లాక్ మెయిల్... బాధితుడు లబోదిబో...

రోజులు మారాయి అంటుంటారే... అది నిజమే. ఈ రోజుల్లో కొంత మంది అమ్మాయిలు కూడా ఇలాంటి బ్లాక్‌మెయిల్స్ చేస్తున్నారు. ముంబైలో జరిగిన ఈ తంతేంటో తెలుసుకుందాం.

 • Share this:
  "అమ్మాయిలు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు. ఆడవాళ్లకు అందం ఆభరణం... అందమే అస్త్రం కూడా. దాన్ని ప్రయోగించి... హనీ ట్రాప్ చేస్తే... మగాళ్లు అడ్డంగా బుక్కవ్వడం ఖాయం. ఎందుకంటే... మగాడి వీక్‌నెస్ ఆడదే"... అన్నాడో సినీ డైలాగ్ రచయిత. సరిగ్గా ఆ డైలాగ్‌కి తగ్గట్టే జరిగిందో ఘటన. ముంబైలో కరోనా లాక్‌డౌన్ ఎత్తేస్తున్న రోజులవి. ఓ పాతికేళ్ల కుర్రాడికి మొబైల్‌కి తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకున్నాడు. ఓ అమ్మాయి అమాయకంగా మాట్లాడింది. "సారీ అండీ... నా ఫ్రెండ్‌కి చేయబోయి... మీకు చేశాను" అంది... అలా మాట కలిపింది. పేరు అడిగింది. మీరు మంచివారిలా ఉన్నారు... అంటూ మెచ్చుకుంటూ... మెల్లగా పరిచయం చేసుకుంది. ఇక అక్కడి నుంచి అప్పుడప్పుడూ కాల్స్ చేస్తూ... "మీకేమైనా జాబ్ ఆఫర్స్ తెలుసా... నా ఫ్రెండ్‌కి జాబ్ కావాలంట" అంటూ ఏదో ఒక వంకతో... మాట్లాడేది. క్రమంగా ఆ స్వీట్ వాయిస్‌కి మనోడు పడిపోయాడు.

  థానే జిల్లాలోని భయాందెర్ ఏరియాలో జరిగిందీ ఘటన. జస్ట్ నెల రోజుల్లో వాళ్ల మధ్య చనువు బాగా పెరిగింది. వాట్సాప్ వీడియో కాల్స్ కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. ఓ రోజు రాత్రి 11 గంటల సమయంలో వాట్సాప్ వీడియో కాల్ చేసింది. రెచ్చగొట్టేలా కైపుగా మాట్లాడింది. తనకు నిద్ర పట్టట్లేదనీ... బోర్ కొడుతోందనీ... ఏదైనా మాట్లాడమని కోరింది. ఓ పావు గంట సోది మాట్లాడాక... నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఉంది అని చెప్పింది. అదేంటి... ఎందుకలా అన్నాడు. తనకు అలా అనిపిస్తోందని చెప్పింది. సరే అంటూ షర్ట్ విప్పాడు. షార్ట్ కూడా విప్పమంది. కాస్త ఆలోచించి... తన రూంలో ఎవరూ లేరు కదా అనుకుంటూ... షార్ట్ కూడా విప్పాడు. పూర్తిగా నగ్నంగా కనిపించాడు. అటూ ఇటూ తిరగమంది.... తిరిగాడు. "థాంక్యూ నాకు నిద్ర వస్తోంది" ఓకే గుడ్ నైట్ అన్నాడు.

  మర్నాడు అసలు కథ మొదలైంది. నిన్న నీ నగ్న సౌందర్యాన్ని రికార్డ్ చేశాను. నేను చెప్పినట్లు చెయ్యకపోతే... ఆ వీడియోని ఇంటర్నెట్‌లో పెడతాను. నీ ఫ్రెండ్స్ అందరికీ పంపుతాను అని బెదిరించింది. ఆ యువకుడు షాక్ అయ్యాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావ్... అంటే... అదంతే... నో డైలాగ్స్... రూ.50వేలు ఇవ్వు అంది. ఆలోచించసాగాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. నేనేదో చిన్న ప్రైవైట్ కంపెనీలో జాబ్ చేసుకునే వాణ్ని అన్నాడు. అదంతా నాకనవసరం డబ్బు ఇవ్వాల్సిందే... అంది... పైగా... "నేనో CBI ఏజెంట్‌ని. నువ్వు ఏ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా... వాళ్లు నన్ను ఏమీ చెయ్యలేరు... రివర్స్ నీపైనే ఏదో ఒక కేసు బుక్ చేసి లోపలేస్తారు" అని బ్లాక్‌మెయిల్ చేసింది.

  గురుడు బాగా భయపడ్డాడు. రూ.37000 ఆమె చెప్పిన మొబైల్ నంబర్‌కి గూగుల్ పే ద్వారా పంపాడు. కానీ... ఆ తర్వాత కూడా ఆమె జిడ్డులా పట్టుకుంది. వరుస కాల్స్‌తో విసుగెత్తించింది. చిరాకొచ్చిన బాధితుడు... ఏదైతే అదే అవుతుంది అనుకుంటూ... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసైతే రాశారు గానీ... వాళ్లకు ఏ వివరాలూ తెలియట్లేదు. ఆమె చేసిన ఫోన్ కాల్స్, మనీ ట్రాన్స్‌ఫర్ మొబైల్ నంబర్... అన్నీ కూడా రియల్‌గా లేవనీ... పక్కా హ్యాకర్లే ఇదంతా చేయించారని అనుకుంటున్నారు. లోతుగా దర్యాప్తు చేసి... న్యాయం చేస్తామంటున్నారు. చూశారా... ఇలా కూడా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే... ఎవరైనా సరే బుక్కైపోతారు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు