ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్లిన భార్యకు...థియేటర్లో అనుకోని షాక్

ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రేక్షకులు పలుచగా ఉన్న ఓ ఇంగ్లీష్ సినిమాకు వెళ్లి మూలన కూర్చొని సరసాలు ఆడటం ప్రారంభించారు. అయితే ఇంటర్వెల్ సమయానికి తన కళ్ల ముందు భర్త ప్రత్యక్షం అవ్వడంతో మహిళకు షాక్ తగిలినంత పని అయ్యింది.

news18-telugu
Updated: September 20, 2019, 7:50 PM IST
ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్లిన భార్యకు...థియేటర్లో అనుకోని షాక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భర్తను కాదని ప్రియుడితో సరస సల్లాపాలకు అలవాటుపడిన మహిళకు అనుకోని ఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్న సిమ్రన్ కౌర్ (పేరు మార్పు) తన భర్తతో కలిసి నివసిస్తోంది. గృహిణిగా ఇంట్లోనే ఉంటున్న ఆ మహిళకు బుద్ధి వక్రమార్గం పట్టింది. తమ అపార్ట్ మెంట్లోనే నివసించే బ్యాచిలర్ కుర్రాడు రోహన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా లైంగిక వాంఛలు తీర్చుకునే స్థాయికి దిగజారింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సినిమా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ గజియాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రేక్షకులు పలుచగా ఉన్న ఓ ఇంగ్లీష్ సినిమాకు వెళ్లి మూలన కూర్చొని సరసాలు ఆడటం ప్రారంభించారు. అయితే ఇంటర్వెల్ సమయానికి తన కళ్ల ముందు భర్త ప్రత్యక్షం అవ్వడంతో మహిళకు షాక్ తగిలినంత పని అయ్యింది.

వెంటనే ప్లేట్ ఫిరాయించి తన పక్కన ఉన్న యువకుడు ఎవరో తెలియదని, అతడితో పరిచయం లేదని, తన స్నేహితురాలితో సినిమా చూసేందుకు రాగా, ఆమె పని ఉండి ఇంటికి వెళ్లిపోయిందని, ఖాళీగా ఉన్న ఆమె సీటులోకి ఇతడు వచ్చి ఏడిపిస్తున్నాడని బుకాయించింది. ఇవేవీ నమ్మని ఆమె భర్త, ఇద్దరిని బాదడం మొదలు పెట్టాడు. తనను మోసం చేసిందని నిందిస్తూ తన కుటుంబ సభ్యులతో సహా థియేటర్ కు రావడంతో దొంగలా దొరికిపోవడం మహిళ వంతు అయ్యింది. ఇద్దరినీ దేహశుద్ధి చేస్తుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు, రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading