Home /News /crime /

WOMAN WAS MURDERED OFTER LOOKING LOVERS WHEN THEY WERE ALONE VRY

crime : రాత్రిపూట, లవర్స్‌ కలిసి ఉండడం చూసిన మరో మహిళ.. అంతే.. ఆమెను అడవిలోకి తీసుకువెళ్లి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime : రాత్రిపూట పొలంలో యువతి ,యువకులను నగ్నంగా చూసిన పాపానికి ఘోరం జరిగింది..దొంగచాటుగా చేసిన పని ఎక్కడ బయటపడుతుందో అనే ఆందోళన చెందిన ఆ ఇద్దరు ఓ మహిళను దారుణంగా చంపారు.. అనంతరం కాళ్లు నరికి పారిపోయారు..

    చేసేది అక్రమమే అయినా అది బయటపడకుండా దొంగచాటుగా చేస్తారు.. అయితే ఆ చేస్తున్న పనిని బయటపడుతుందని తెలిస్తే... ఎంతకైనా తెగిస్తారు.. చివరకు తాము బయటపడకుండా ఉండేందుకు ప్రాణాలు కూడా తీస్తున్నారు.. అయితే ఆ ప్రాణాలు తీసిన తర్వాత అసలు నిజాలతోపాటు హత్య కేసులు కూడా నమోదు అవుతున్నాయి.. ఇలా ఒక నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో నేరం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళణ కల్గిస్తున్నా.. దేశంలో ఎక్కడో ఓ చోట ఇలాంటీ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి..ఇలా తాజగా రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన సంచలనంగా మారింది.రాజస్థాన్‌లోని రాజస్మంద్ నగర సమీపంలోని గ్రామంలో ఓ మహిళను కిరాతకంగా చంపి పడేశారు.

    వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న అమరతియా గ్రామంలో నివసించే జీవారామ్(50) అనే రైతు రాత్రి పొలంలో తన భార్య కంకుబాయి(45) కోసం ఎదురు చూస్తుండగా.. ఆమె భోజనం తీసుకొని ఎంతసేపటికీ రాలేదు. దీంతో కంకుబాయిని వెతుకుతూ జీవారామ్ బయలుదేరాడు. గ్రామస్తులందరినీ తన భార్య గురించి అడిగాడు. జీవారామ్‌తో కలిసి అతని బంధువులు కంకుబాయ్ కోసం ఎంత ప్రయత్నించినా ఆమె దొరకలేదు. అయితే కంకుబాయి శవం తెల్లవారుఝామున పక్కనే ఉన్న అడవి ప్రాంతంలో దొరికింది...ఆమె శవానికి కాళ్లు లేవు. అయితే అడవిలో శవం లభించడం, శవానికి కాళ్లు కూడా లేకపోవడంతో.. గ్రామస్తులంతా.. ఇదేదో జంతువు చేసిన పనిగా అనుకున్నారు.

    ఇది చదవండి : ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్.. ఫోన్‌నంబర్‌తో ఇంటి వివరాలు.. !


    కానీ ఆమె కాళ్లు ఏదో గొడ్డలితో నరికిన విధంగా కనిపించాయి.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య సమాచారం అందుకున్న పోలీసులు కంకుబాయ్ శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు విచారణలో కొందరు గ్రామస్తులు జీవారామ్ పొలం కంటే ముందుగా వచ్చే పొలం వద్ద ఆరోజు రాత్రి ఒక యువకుడిని చూసినట్లు చెప్పారు. ఆ యువకుడు పక్క గ్రామంలో నివసించే గోపి అని తెలిసింది. గోపిని అరెస్ట్ చేసిన పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించగా.. అతను నిజం ఒప్పుకున్నాడు.

    కంకుబాయ్ చనిపోయిన రాత్రి తాను జీవారామ్ పొలం సమీపంలోని మరో పొలం వద్ద తన ప్రేయసితో ఉన్నానని.. గోపి చెప్పాడు. కంకుబాయ్ ఇద్దరు ప్రేమికులని శృంగారం చేసుకుంటుండగా చూసిందని, ఈ విషయం బయట ఎక్కడా ఆమె చెప్పకముందే ఆమెను చంపాల్సి వచ్చిందిని తెలిపాడు. మరి కంకుబాయ్ కాళ్లు ఎందుకు నరికావు? అని పోలీసుల ప్రశ్నించగా.. కంకుబాయ్ కాళ్లకి పెద్ద పెద్ద కడియాలు, గజ్జెలు తీసుకునేందుకు ఆమె కాళ్లు నరికానని ఒప్పుకున్నాడు. దొంగలు ఈ హత్య చేశారని పోలీసులను నమ్మించడానికే అలా చేశానని తన నేరం ఒప్పుకున్నాడు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime, India, Murder, Rajastan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు