Female Thief: ఇదెక్కడి దొంగతనం.. ఏమన్నా తెలివా.. కానీ తప్పు కద.. దొరికిపోయింది.. ఎలాగంటే..

సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యం

సమాజంలో ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు దొంగలుగా మారుతున్నారు. కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే.. ఈ దొంగతనాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు జేబుకు తెలియకుండా పర్సు కత్తిరించేవారైతే, మరికొందరు ఏదో కొనేందుకు వెళ్లినట్టు వెళ్లి మూడో కంటికి తెలియకుండా వస్తువులను దొంగిలిస్తుంటారు.

 • Share this:
  పుక్రయాన్: సమాజంలో ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు దొంగలుగా మారుతున్నారు. కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే.. ఈ దొంగతనాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు జేబుకు తెలియకుండా పర్సు కత్తిరించేవారైతే, మరికొందరు ఏదో కొనేందుకు వెళ్లినట్టు వెళ్లి మూడో కంటికి తెలియకుండా వస్తువులను దొంగిలిస్తుంటారు. బట్టల దుకాణాలు, నగల దుకాణాలనే ఇలాంటి దొంగలు టార్గెట్‌గా చేసుకుంటుంటారు. ఎక్కువగా లేడీ దొంగలే ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తుంటాయి. సీసీ కెమెరాల్లో ఆ మహిళా దొంగలు చేసే జిమ్మిక్కులు రికార్డవుతుంటాయి.

  తాజాగా.. కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుక్రయాన్ పట్టణంలోని కూడా అదే జరిగింది. ఆమెను చూస్తే అసలు ఎవరూ దొంగ అనుకోరు. అంత పద్ధతిగా డ్రస్ చేసుకుని, చేతికి వాచ్ ధరించి బంగారు దుకాణానికి కస్టమర్‌లా వెళ్లింది. అయితే.. ఆ షాపులో సీసీ కెమెరాలు ఉన్న సంగతి మాత్రం గమనించలేదు. దీంతో.. ఈ కిలేడీ దొంగ చోర నైపుణ్యమంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ ఫుటేజీలే లేకపోతే ఆమే దొంగ అని తేల్చడం కష్టతరమయ్యేది. అంత చాకచక్యంగా గోల్డ్ రింగ్ నొక్కేసింది.

  ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి

  గోల్డ్ రింగ్స్ చూపించమని అడగ్గానే.. ఆ షాపు యజమాని ఒక బాక్స్ తీసి పలు మోడల్స్ చూపించాడు. ఇవి చూస్తున్నా.. ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటే చూపించడంటూ ఆమె అనడంతో షాపు యజమాని కిందకు వంగి వేరే బాక్స్ తీస్తున్నాడు. ఈ గ్యాప్‌లో ఆమె ముందు ఉంచిన బాక్స్ నుంచి సెకన్ల వ్యవధిలో గోల్డ్ రింగ్‌ను ఆ మహిళ దొంగతనం చేసింది. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే.. ఆ మహిళ ఎదురుగా ఉన్న బాక్స్‌లో చేయి పెట్టి రింగ్ చూస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఒక చేతికి రింగ్ తొడుక్కుంది. మరో చేత్తో అనుమానం రాకుండా ఆ రింగ్‌ను వేలికి ఎక్కించింది. ఆ తర్వాత రింగ్ కనిపిస్తే డౌట్ వస్తుందని ఆ రింగ్ పెట్టుకున్న చేతిని స్టైలిష్‌గా జుట్టులో పెట్టుకుని మాయ చేసింది. ఆ బాక్స్ ఎక్కువ సేపు ఎదురుగా ఉంటే రింగ్ మాయం చేసిందన్న విషయం యజమాని పసిగడతాడేమోనని తానే ఆ బాక్స్‌ మూసేసింది.

  ఇది కూడా చదవండి: 29Yr Old Woman: ‘నైట్‌కు రేటెంత’ అని అడుగుతున్నారు.. ఈమె ‘కాల్ గర్ల్’ కాదు.. కానీ ఇలాంటి కాల్స్ ఎందుకొస్తున్నాయంటే..

  యజమానికి కూడా అనుమానం రాలేదు. తనకు నచ్చిన రింగ్స్ లేవంటూ సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు మహిళ ప్రయత్నించింది. అయితే.. సీసీ దృశ్యాల్లో ఆ మహిళ దొంగతనం చేసినట్లు స్పష్టం రికార్డవడంతో యజమాని షాపు నుంచి వెళ్లిపోతున్న ఆ మహిళను రోడ్డుపై అడ్డగించాడు. దొంగతనం చేసి పారిపోతోందని అక్కడున్న వారికి చెప్పాడు. తాను దొంగని కాదని దబాయించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డవడంతో ఆమె ఆటలు సాగలేదు. మహిళ కావడంతో పోలీసులకు సమాచారం అందించడంతో మహిళా కానిస్టేబుల్ సాయంతో ఈ కిలేడీ దొంగను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
  Published by:Sambasiva Reddy
  First published: