Crual murder : హత్య చేసి గట్టిగా కౌగిలించుకుని వదల్లేదు.. పోలీసులు వచ్చే వరకు ఇదే సీన్.. కారణం ఏంటి

Crual murder : హత్య చేసి గట్టిగా కౌగిలించుకుని వదల్లేదు..

Crual murder : పెళ్లైన వివాహిత వెంట పడిన ఓ యువకుడు తనతో కలిసి ఉండమని ఫోర్స్ చేశాడు. అయినా ఆమె వినకపోవడంతో దారుణానికి దిగాడు.. ఆమె పని చేస్తున్న దగ్గరికి వెళ్లి కత్తితో దారుణంగా హతమార్చాడు. అనంతరం చనిపోయిన శవాన్ని పట్టుకుని పోలీసులు వచ్చేవరకు లేవకుండా పడుకునే ఉన్నాడు.

  • Share this:
    పెళ్లైన వివాహిత వెంట పడిన ఓ యువకుడు తనతో కలిసి ఉండమని ఫోర్స్ చేశాడు. అయినా ఆమె వినకపోవడంతో దారుణానికి దిగాడు.. ఆమె పని చేస్తున్న దగ్గరికి వెళ్లి కత్తితో దారుణంగా హతమార్చాడు. అనంతరం చనిపోయిన శవాన్ని పట్టుకుని పోలీసులు వచ్చేవరకు లేవకుండా పడుకునే ఉన్నాడు.

    రాజస్థాన్‌లో ( Rajastan ) దారుణం చోటు చేసుకుంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా మహిళ వెంట పడిన ఓ యువకుడు చివరకు ఆమెను ( Murder ) హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లాహోర్ ప్రాంతానికి చెందిన శాంతిదేవికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె భర్త మహరాష్ట్రాలో ( Maharshtra ) ఉపాధి నిమిత్తం పని చేస్తున్నాడు. అయితే ఇద్దరు పిల్లలతో శాంతిదేవి స్థానికంగా ఉంటూ ఉపాధి పనులకు వెళుతోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన గణేష్ అనే యువకుడు శాంతి వెంట పడ్డాడు. తనను ప్రేమిస్తున్నానని ( love ) వేధించాడు. అయితే అంతకు ముందే వారిద్దరికి పరిచయం ఉండడంతో మరింత రెచ్చిపోయాడు. దీంతో శాంతి గణేశ్ ప్రపోజల్‌ను నిరాకరిస్తూ వస్తోంది. దీంతో ఇటివల ఆమెపై కక్షను పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని కసిగా ఉన్నాడు.

    ఇది చదవండి : చేసేది దొంగతనం..బిల్డప్ మాత్రం బిజినెస్.. గ్రామాల్లో రోడ్లు.. పదిమంది లవర్స్.. ఇంకా చాలానే..


    ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆమె పనిచేస్తున్న ఉపాధి పనుల వద్దకు వెళ్లిన గణేశ్ మరోసారి తనతో రావాలని కోరాడు. అయితే ఇందుకు నిరాకరించిన శాంతిపై వెంటనే ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆమెను అక్కడే హతమర్చేందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి ( Attack ) చేశాడు. చుట్టుపక్కల వారు ఆపడానికి వెళ్లినా... వారిపై కూడా కత్తితో ( Knife ) బెదిరించాడు. దీంతో దగ్గరికి వెళ్లడానికి భయపడడంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఇక చనిపోయిన తర్వాత కూడా నిందితుడు ఆమెను వదిలిపెట్టలేదు. శవాన్ని ( Dead body ) వదలి పెట్టకుండా అలాగే పట్టుకున్నాడు. అలా పోలీసులు వచ్చే వరకు పట్టుకుని ఉన్నాడు. పోలీసులు వచ్చి బలవంతంగా గుంజితే కాని...వదలిపెట్టని పరిస్థితిలో ఉన్మాదంగా వ్యవహరించాడు.
    Published by:yveerash yveerash
    First published: