Home /News /crime /

WOMAN WAS ARREST WHO KILLED FIVE MEMBER IN MANDYA OF KARNATAKA VRY

Crime story : కిల్లర్ కిలేడి... ప్రియుడి కోసం, మొత్తం 5గురిని ఖతం చేసింది.. ఎలా అంటే..

నిందితురాలు

నిందితురాలు

Crime story : ప్రియుడి కోసం ఆయన చేసుకున్న భార్యతో పాటు ముగ్గురు పిల్లలను చంపిన ఓ కిలేడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడు లేని సమయంలో తెల్లవారు జామున చికెన్ సెంటర్‌లో కత్తిని తీసుకువెళ్లి నిద్రలో ఉన్నవారినే ఆమహిళ దారుణంగా హతమార్చింది.

ఇంకా చదవండి ...
  వరుసకు సోదరి అయిన ఆమె భర్తపై పడింది.. ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంది.. అది చాలక తనకు పెళ్లైనా కూడా భర్తను వీడి ప్రియుడి వద్దకు వెళ్లాలనే క్రూరమైన కుట్రకు తెరతీసింది. దీంతో సోదరి ఆమె పిల్లలు బతికుండగా తన ప్రియుడికి సొంతం కాలేనని భావించింది. దీంతో వారిని ఏదో విధంగా మట్టుబెట్టి తప్పించుకోవాలని చూసింది. తానే చంపితే అనమానం రాదని భావించింది. అందుకే నేరుగా రంగంలోకి దిగింది. సోదరితోపాటు ముగ్గురి పిల్లలను మరో యువకుడిని కత్తితో హతమార్చింది.

  కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో ఈనెల 6 దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లోని ఓ మహిళతోపాటు ముగ్గురు చిన్ని పిల్లలు మరో యువకుడు హత్యకు గురయ్యారు.ఈ హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే కేసును చేధించారు.. హత్య చేసి ఓ మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం హత్య జరగడానికి గల కారణాలు వెల్లడించారు.

  Love story : ఈమె మాములు లవర్ కాదు.. పెళ్లైన మరునాడే, భర్తను రోడ్డుపై పెట్టి టాయ్‌లెట్‌కు వెళ్లింది..తీరా..

  నిందుతురాలు తనకు సోదరి వరుస అయిన లక్ష్మి భర్త గంగారామ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆయనంటే ఆమె పిచ్చిగా మారింది. కాగా గంగారామ్‌ వస్త్ర వ్యాపారం చేస్తూ .. నిత్యం పలు రాష్ట్రాలు తిరుగుతాడు. ఈ క్రమంలోనే నిందితురాలు ఆమె సోదరిని భర్త నుండి దూరం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. కాని లాభం లేకపోవడంతో నేరుగా ఆ కుటుంబాన్ని హతమార్చేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే గంగారం గత ఆదివారం ఇంట్లో లేని అర్థరాత్రి సమయంలో నిందితురాలు ఆయన ఇంటికి వెళ్లింది. ఆమె చాలా సేపు వాగ్వావాదానికి దిగింది. ఈ క్రమంలోనే అప్పటికే చికెన్ సెంటర్ నుండి తెచ్చుకున్న కత్తితో ఆమెను హతమార్చింది. ఇక వాగ్వావాదం సయయంలో ముగ్గురు పది సంవత్సరాల లోపు పిల్లలు లేచి ఏడుస్తుండగా వారిని కూడా దారుణంగా హతమార్చింది. వారితోపాటు ఉన్న మరో యువకుడిని కూడా హతమార్చింది.

  Telangana: టీఆర్​ఎస్​ సంచలన నిర్ణయం..! ప్రధాని నరేంద్ర మోదీపై సభా హక్కుల ఉల్లంఘన? సాధ్యాసాధ్యాలపై న్యాయ నిపుణులతో చర్చలు..

  ఇలా ఐదు హత్యలు చేసిన తర్వాత ఇంట్లో దోపిడి జరిగినట్టుగా చీత్రీకరించింది. బీరువాలోని బట్టలు చెల్లాచెదురు చేసింది. తనకు అంటిన రక్తపు మరకల బట్టలు కూడా మార్చుకుంది. ఆ తర్వాత మృతదేహాలపై బట్టలు కప్పి ఓ టూ వీలర్‌పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ఇంటినుండి బయటకు వెళ్లింది. ఏమి తెలియనట్టు తిరిగి మరునాడు వారి అంత్యక్రియలకు సైతం హజరయ్యింది. అయితే విచారణ జరిపిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ఆమె తెల్లవారుజామున నాలుగు గంటలకు నిందితురాలు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి అసలు నిజాలు రాబట్టారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime, Karnataka

  తదుపరి వార్తలు